For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రీఎంట్రీలో ఇషాన్ కిషన్ అట్టర్ ఫ్లాప్

మానసిక అలసట కారణంగా క్రికెట్ నుంచి విరామం తీసుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఎట్టకేలకు తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. నవీ ముంబై వేదికగా జరుగుతున్న డీవై పటేల్ టీ20 కప్‌లో ఆర్బీఐ జట్టు తరఫున పోటీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ పునరాగమన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. 12 బంతులు ఎదుర్కొన్న అతను 19 పరుగులు చేశాడు. రెండు బౌండరీలు, ఒక సిక్సర్ బాదాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.

అయితే 25 ఏళ్ల ఇషాన్ వికెట్‌కీపింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. సయాన్ బౌలింగ్‌లో సుమిత్‌ను స్టంపౌట్‌చేశాడు. కాగా, రూట్ మొబైల్ లిమిటె‌డ్ జట్టుతో జరిగిన మ్యాచ్ ఆర్బీఐ 89 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత రూట్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఆయుష్ 31 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అనంతరం ఛేదనలో ఆర్బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది.

Ishan Kishans utter flop after re-entry with the DY Patil T20 Cup

భారత్ తరఫున ఇషాన్ కిషన్ చివరిగా గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో బరిలోకి దిగాడు. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ అర్ధంతంగా పర్యటన నుంచి తప్పుకున్నాడు. మానసిక అలసట కారణంగా స్వదేశానికి తిరిగొచ్చాడు. అనంతరం అతడు తిరిగి రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ లేదా పోటీ క్రికెట్ ఆడాలని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు.

కానీ ఇషాన్ కిషన్ వడోదరలో పాండ్య బ్రదర్స్‌తో కలిసి ప్రాక్టీస్ చేశాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇషాన్ కిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీమిండియాకు దూరంగా ఉండి సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీలో తప్పక ఆడాలని ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ ఇషాన్ రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున బరిలోకి దిగలేదు. దీంతో అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఎట్టకేలకు పోటీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు హార్దిక్ పాండ్య కూడా డీవై పటేల్ టీ20 కప్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. రిలయన్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.

Story first published: Wednesday, February 28, 2024, 9:26 [IST]
Other articles published on Feb 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+