For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇషాన్ కిషన్ vs జీషన్ అన్సారీ.. డిష్యూం..డిష్యూం! (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే మైదానంలో వాతావరణం వేడెక్కుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో అంతర్గతంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టుకు దూరం కావడంతో జట్టు పగ్గాలను చేపట్టిన తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్, యువ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ మధ్య జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇషాన్ కిషన్ విధ్వంసం.. జీషన్ అన్సారీ ప్రతీకారం
శనివారం జరిగిన ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తనదైన స్టైల్‌లో విరుచుకుపడ్డాడు. జీషన్ అన్సారీ వేసిన ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్ ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో స్పిన్నర్‌పై ఇషాన్ కిషన్ ఒత్తిడి పెంచాడు. అయితే జీషన్ అన్సారీ ఏ మాత్రం అధైర్యపడకుండా అదే ఓవర్ చివరి బంతికి ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసి గట్టి దెబ్బకొట్టాడు.

Ishan Kishan vs Zeeshan Ansari Fiery Exchange in SRH Practice Match Ahead of IPL 2026 Opener

స్టేడియంలో అసలేం జరిగిందంటే?
వికెట్ తీసిన ఉత్సాహంలో జీషన్ అన్సారీ, ఇషాన్ కిషన్‌కు కాస్త ఘాటుగానే సెండాఫ్ ఇచ్చాడు. ఈ ప్రవర్తనతో క్రీజులో ఉన్న ఇషాన్ కిషన్ ఒక్కసారిగా ఆగిపోయి జీషన్ అన్సారీతో మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య కొన్ని సెకన్లు పాటు సీరియస్ చర్చ జరిగినట్లు కనిపించింది. అయితే చివరలో ఇషాన్ కిషన్ చిరునవ్వు చిందిస్తూ పెవిలియన్ వైపు వెళ్లడంతో ఇది కేవలం ఆటలో భాగంగా జరిగిన చిన్నపాటి పోటీ మాత్రమేనని అర్థమైంది.

గత సీజన్ వైఫల్యాల నుంచి గుణపాఠం
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం 6 మాత్రమే గెలిచి.. 7 మ్యాచుల్లో ఓటమిని చవిచూసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి కీలక ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం జట్టును దెబ్బతీసింది. హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే (487 పరుగులు) నిలకడగా రాణించాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి పోరాటాన్ని మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ప్రారంభించనుంది.

Story first published: Sunday, March 22, 2026, 9:04 [IST]
Other articles published on Mar 22, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+