ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ.. 19ఫోర్లు, 11సిక్సులతో విధ్వంసం! 324 పరుగుల తేడాతో విజయం!

ఇండోర్: దేశవాళీ టోర్నీ 'విజయ్ హజారే' ట్రోఫీ మ్యాచ్‌లో వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఎలైట్ గ్రూప్ బీ మ్యాచ్‌లో జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ దుమ్మురేపాడు. శనివారం మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 94 బంతుల్లోనే 173 రన్స్ చేశాడు. భారీ షాట్లతో హోరెత్తించిన ఇషాన్ ఇన్నింగ్స్‌లో మొత్తం 11 సిక్స్‌లు, 19 ఫోర్లు ఉండడం విశేషం. ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ముంగిట ఇషాన్ మెరుపు శతకం బాది బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. కనీసం టీ20ల్లో అయినా చోటు దక్కుతుందో చూడాలి.

ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ:
మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్.. 74 బంతుల్లోనే ఈ యువ హిట్టర్ 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత 20 బంతుల్లోనే మరో 73 స్కోరు చేశాడు. ఇషాన్ జోరుతో ఝార్ఖండ్ 26 ఓవర్లకే 200 పరుగుల మైలురాయిని అందుకుంది. అయితే 28వ ఓవర్లో ఇషాన్ ఔటవగా.. ఆ తర్వాత విరాట్ సింగ్ (68), సుమిత్ కుమార్ (52), అన్‌కుల్ రాయ్ (72: 39 బంతుల్లో 3x4, 7x6) బ్యాట్ ఝలిపించడంతో ఝార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది.

ఆరేసిన వరుణ్ ఆరోన్:
423 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు 18.4 ఓవర్లలో 98 రన్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో జార్ఖండ్ 324 పరుగుల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ బండారి (42) టాప్ స్కోరర్. వరుణ్ ఆరోన్ 6 వికెట్లు పడగొట్టాడు. 5.4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. రెండు మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. ఇషాన్ దూకుడుతో 50 ఓవర్ల స్వదేశీ టోర్నీల్లో జార్ఖండ్ జట్టు అత్యధిక స్కోర్ నమోదు చేసింది. గతంలో విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక స్కోర్ సాధించిన ఘనత మధ్యప్రదేశ్ జట్టుపై ఉంది. 2010 టోర్నీలో రైల్వేస్‌పై ఆరు వికెట్లకు 412 రన్స్ చేసింది. విజయ్ హజారే టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ నిలిచాడు.

వికెట్ కీపర్ రేసులో ఇషాన్:
ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున నిలకడగా రాణించిన ఇషాన్ కిషన్.. ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికయ్యేలా కనిపించాడు. కానీ బీసీసీఐ సెలెక్టర్లు అతనికి మొండిచేయి చూపారు. ఇంగ్లండ్‌తో మార్చి 12 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచుల కోసం త్వరలోనే టీమ్‌ని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే వికెట్ కీపర్/బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ నిలకడగా రాణిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రెండో వికెట్ కీపర్ రేసులో సంజు శాంసన్, కేఎల్ రాహుల్ ఉన్నారు. తాజాగా సెంచరీతో ఇషాన్ కిషన్ కూడా పోటీలోకి వచ్చాడు. మరి అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications