ఐపీఎల్‌కు ఆడినట్టుగా జాతీయ జట్టుకు ఆడటం సులువుకాదు.. ఎక్కడ చోటిచ్చినా సంతోషమే: కిషన్

అహ్మదాబాద్: దేశవాళీ, ఐపీఎల్‌కు ఆడినట్టుగా జాతీయ జట్టుకు ఆడటం సులువైన పనేమీ కాదని టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో ఎక్కడ చోటిచ్చినా సంతోషమేనని చెప్పాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, డైరెక్టర్ జహీర్ ఖాన్ తనకు మార్గనిర్దేశం చేయడం అదృష్టమని కిషన్ వెల్లడించాడు. ఐపీఎల్ 2020లో అద్భుత ప్రదర్శన చేసిన కిషన్.. బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లకు ఎంపిక చేయకపోయినా.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఆడే మ్యాచులకు మాత్రం ఎంపికయ్యాడు.

దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద
ఝార్ఖండ్‌కు చెందిన ఇషాన్ కిషన్ ఎడమచేతివాటం వికెట్‌కీపర్ కమ్ బ్యాట్స్‌మన్. రిషబ్ పంత్ స్థానానికి అతడు పోటీ పడుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రెండేళ్లకు ముంబై ఇండియన్స్ తరఫున నిలకడగా పరుగులు చేస్తున్నాడు. నిర్భయంగా క్రికెట్ ఆడుతూ భారీ సిక్సర్లు బాదడం అతడి నైజం. రోహిత్ సారథ్యంలోని ముంబై వరుసగా రెండు ట్రోఫీలు గెలవడంలో కిషన్ పాత్ర ఎంతైనా ఉంది. దేశవాళీలో మంచి ప్రదర్శనలు చేస్తున్న అతడికి సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టీ20 సిరీసుకు అవకాశమిచ్చారు.

టీమిండియాకు ఎంపికవ్వడం సంక్లిష్టమే
'టీమిండియాకు ఎంపికవ్వడం ఎప్పటికీ సంక్లిష్టమే. కానీ ఆ ప్రక్రియ అలాగే ఉంటుంది. ఏ స్థానంలో ఆడటానికైనా నాకు అభ్యంతరం లేదు. టాప్ నుంచి మిడిలార్డర్ వరకు ఎక్కడైనా ఆడగలను. ఒత్తిడిలో ఆడేటప్పుడు నేను మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటా. దేశవాళీ క్రికెట్లో వివిధ ఫార్మాట్లు, భారత్-కు ఆడటంతో నాకు అనుభవం వచ్చింది' అని తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇషాన్ కిషన్ అన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా కిషన్ మెరిశాడు. జార్ఖండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం రావడం కష్టంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

నా కెరీర్‌నే మార్చేసింది
'ఐపీఎల్‌లో అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవడం కీలకం. అంకితభావం, కసితో ఆడితేనే గీత దాటగలం. రోహిత్ భాయ్ సహా డ్రస్సింగ్ రూమ్‌లో అనేక మంది మార్గనిర్దేశకులు ఉండటం అద్భుతం. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాలో తెలుసుకోవచ్చు. ముంబై ఇండియన్స్‌కు ఆడటం నా కెరీర్‌నే మార్చేసింది. కోచ్‌లు, రోహిత్ భయ్యా, జహీర్ భాయ్ మెంటార్‌షిప్ నాకెంతగానో ఉపయోగపడింది' అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

జట్టులో ప్రయోగాలు
బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై తొలి టీ20లో దెబ్బతిన్న భారత్ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరిగే రెండో టీ20లో మెరుగైన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పుంజుకోవాలని చూస్తోంది. తొలి మ్యాచ్ ఓటమితో తక్కువ అంచనా వేయవద్దని ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ల్లో నిరూపించిన కోహ్లీసేన.. ప్రస్తుత టీ20 సిరీస్‌లోనూ అదే విధంగా పోరాట పటిమతో దూసుకు రావాలని పట్టుదలగా ఉంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని దూకుడైన బ్యాటింగ్‌తో పాటు జట్టులో ప్రయోగాలు చేయాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు.
India vs England: విరాట్ కోహ్లీని అలా ఔట్ చేయడం.. ఇంగ్లండ్‌కు నిజమైన బోనస్! సంతోషంగా ఉంది: ఆర్చర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications