Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిషేక్ డకౌట్.. కెప్టెన్ ఇషాన్ కిషన్ షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయం అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ జట్టు ఆటతీరుపై హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా అరంగేట్ర మ్యాచ్‌లోనే చెలరేగిపోయిన యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌లను ఇషాన్ కిషన్ ఆకాశానికెత్తేశాడు. వీరిద్దరూ తమ అరంగేట్ర మ్యాచ్‌లోనే చెరో నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్థాన్ నడ్డి విరిచారని.. వారే అసలైన మ్యాచ్ విన్నర్లు అని ఇషాన్ కిషన్ కొనియాడాడు.

హింగే రికార్డు స్పెల్
ఈ మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన ప్రఫుల్ హింగే తన తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. దీనిపై ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. "గెలుపు పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా బౌలర్లు మేము ఆశించిన దానికంటే అద్భుతంగా రాణించారు. యువ ఆటగాళ్లలో గెలవాలనే తపన ఎంత ఉందో ఈ మ్యాచ్ నిరూపించింది. బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ పర్యవేక్షణలో వీరు కఠినంగా శ్రమిస్తున్నారు. సొంత గడ్డపై వారికి అవకాశం ఇవ్వాలని మేము తీసుకున్న నిర్ణయం సరైనదని ఈ రోజు నిరూపితమైంది" అని ఇషాన్ కిషన్ వెల్లడించాడు.

Ishan Kishan Reaction to Abhishek Sharma Duck and Historic IPL Debut of Sunrisers Hyderabad Young Pacers

కెప్టెన్ ఇన్నింగ్స్.. ముందుండి నడిపించిన ఇషాన్ కిషన్
మరోవైపు బ్యాటింగ్‌లోనూ ఇషాన్ కిషన్ ముందుండి నడిపించాడు. కేవలం 44 బంతుల్లోనే 91 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడుయ జట్టు ప్రణాళికలను ప్లేయర్లు మైదానంలో పక్కాగా అమలు చేశారని.. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఆడుతూ తమ బాధ్యతను నెరవేర్చారని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు. ఈ గెలుపు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని.. పాయింట్ల పట్టికలో రెండు కీలక పాయింట్లు సాధించడం ముఖ్యమని ఇషాన్ కిషన్ అన్నాడు.

అభిషేక్ శర్మకు అండగా నిలిచిన కెప్టెన్
ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి బంతికే డకౌట్ కావడంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో కెప్టెన్ ఇషాన్ అతనికి పూర్తి మద్దతుగా నిలిచాడు. "అభిషేక్ ఆడే శైలి అలాంటిది. వేగంగా ఆడే క్రమంలో కొన్నిసార్లు త్వరగా ఔట్ అవ్వడం సహజం. అభిషేక్ స్వేచ్ఛగా ఆడేలా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడం మా బాధ్యత. అభిషేక్ క్రీజులో నిలబడితే మేము ఎంతటి భారీ స్కోరునైనా సులభంగా సాధించగలం. ఈ రోజు నిరాశపరిచినా, తర్వాతి మ్యాచ్‌లో మరింత కసితో తిరిగి వస్తాడని నాకు నమ్మకం ఉంది" అని సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ స్పష్టం చేశాడు.

Story first published: Tuesday, April 14, 2026, 9:52 [IST]
Other articles published on Apr 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+