పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్‌తోని అట్లుంటది మరీ.. ఏకంగా 68స్థానాలు ఎగబాకి టాప్10లోకి

టీమిండియా పాకెట్ డైనమైట్, డాషింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తాజా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో టీమిండియా తరఫున అత్యుత్తమ ర్యాంక్ కలిగిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఏకంగా 68స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటుదక్కించుకున్నాడు. ప్రస్తుతం 7వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. తద్వారా ప్రముఖ క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇషాన్ కిషన్ గతేడాది అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
ఇక కేఎల్ రాహుల్ 14వ ర్యాంక్‌కు దిగజారడంతో టాప్ 10బ్యాటర్లలో చోటు దక్కించుకున్న ఏకైక భారత బ్యాటర్‌గా 23ఏళ్ల ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇకపోతే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఒక్కో ర్యాంక్ దిగజారి వరుసగా 16వ, 17వ స్థానాల్లో నిలిచారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు దిగజారి 21వ ర్యాంక్‌కు పడిపోయాడు.
దక్షిణాఫ్రికా సిరీస్లో మంచి టచ్‌లో ఇషాన్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో రెండు హాఫ్ సెంచరీలతో సహా 164పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ అద్భుతమైన టచ్‌లో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో కిషన్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్లేయర్. అతను టీమిండియా తరపున కేవలం 13మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతను దాదాపు 38సగటుతో 453పరుగులు చేశాడు. అతను నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే కిషన్ 132.46 స్ట్రైక్ రేట్ మెయింటెన్ చేస్తూ ఆడుతున్నాడు.

7స్థానాలు ఎగబాకిన భువీ
టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ల గురించి మాట్లాడితే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఏడు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ప్రస్తుతం టీ20 బౌలర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ 16స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

టెస్టు ర్యాంకింగ్స్‌లో మనోళ్లు ఇలా
టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా 3వ స్థానంలో పదిలంగా కొనసాగుతుండగా.. రెండవ ర్యాంక్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థిరంగా కొనసాగుతున్నాడు. ఇకపోతే టెస్టుల్లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆల్రౌండర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు.
ఇక టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా ఏడు, 10వ స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరుసగా సెంచరీలు బాదిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లాబుషేన్ రెండో స్థానానికి పడిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications