ఇషాన్ కిషన్ చేసిన పనికి గర్ల్‌ఫ్రెండ్ అదితి ఫేస్ మాడిపోయింది! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఓ కీలకమైన రనౌట్ అవకాశాన్ని చేజార్చుకోవడంతో గ్యాలరీలో ఉన్న అతడి గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా ముఖం ఒక్కసారిగా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిరాశలో మునిగిపోయిన అదితి!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ పోరులో లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జయదేవ్ ఉనద్కత్ వేసిన బంతికి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌ను రనౌట్ చేసే సువర్ణావకాశం ఇషాన్ కిషన్‌కు లభించింది. ఆ సమయంలో మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరిత దశలో ఉంది. రిషబ్ పంత్ వంటి కీలక బ్యాటర్ వికెట్ పడి ఉంటే మ్యాచ్ ఫలితం హైదరాబాద్ వైపు మొగ్గేది. కానీ ఇషాన్ కిషన్ రనౌట్ మిస్ చేయడంతో స్టేడియంలో ఉన్న అదితి హుండియా తీవ్ర నిరాశకు గురైంది. ఆమె ముఖం మాడిపోవడమే కాకుండా చాలా మైమరిచిపోయి దిగులుగా కనిపించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.

అదితి రియాక్షన్ వైరల్
గత నెలలో(మార్చి 2026) న్యూజిలాండ్ జట్టును ఓడించి భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు కూడా అదితి హుండియా వార్తల్లో నిలిచింది. ప్రపంచ కప్ గెలిచిన అనంతరం స్టేడియంలో ఇషాన్ కిషన్‌తో కలిసి ఆమె సందడి చేసింది. మోడలింగ్ లో రాణిస్తున్న అదితి హుండియా.. ఇషాన్ ఆడే దాదాపు అన్ని ముఖ్యమైన మ్యాచ్‌లకు హాజరవుతుంటుంది. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం తన ప్రియుడి జట్టు ఓడిపోవడం, అందులోనూ ఇషాన్ కిషన్ చేసిన పొరపాటు పట్ల అదితి రియాక్షన్ నెటిజన్లను ఆకర్షించింది.
మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసింది. హెన్రిచ్ క్లాసెన్(62), నితీష్ కుమార్ రెడ్డి(56) అర్థశతకాలతో రాణించగా.. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. లక్నో బౌలర్ మహమ్మద్ షమీ కేవలం 9 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌ను కట్టడి చేశాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. రిషబ్ పంత్(68 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ బౌలర్లలో హర్ష్ దూబే 2 వికెట్లు తీసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications