Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ishan Kishan: ఇషాన్ కిషన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా?

Ishan Kishan: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా 41వ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వికెట్ విషయంలో వివాదం చెలరేగింది. నిజానికి దీపక్ చాహర్ వేసిన బంతికి ఎటువంటి అప్పీల్ లేకుండానే అంపైర్ ఇషాన్ కిషన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. అసలు వింత ఏమిటంటే ఇషాన్ కిషన్ కూడా అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. ఇషాన్ కిషన్ రివ్యూ కూడా తీసుకోలేదు. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ గురించి సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఇషాన్ కిషన్ కీపర్ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. అతని బ్యాట్ బంతిని తాకిందో లేదో కూడా అతనికి తెలియదు. అటువంటి పరిస్థితిలో, అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో కూడా వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ముంపబై తరఫున ఆడుతున్నాడా అనే ప్రశ్న కూడా వచ్చింది. అలాగే ఇషాన్ కిషన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఐదు ఛాంపియన్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ జట్టుతో తన ఐపీఎల్ కెరీర్ ను ప్రారంభించిన ఇషాన్ కిషన్ ఇంకా ముంబై తరపున ఆడుతున్నాడా అని అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఇషాన్ కిషన్ రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోవడంపై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పేలవంగా ఆడుతుండడంతో అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన ఇషాన్ కిషన్ ఔట్ కాకుండా తనంతట తానుగా పెవిలియన్ వైపు నడిచి వెళ్లడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.

Ishan Kishan Match Fixing Allegations Walks Without Review Sparks Huge IPL 2025 Controversy

ఇటీవల కాలంలో ఐపీఎల్ సిరీస్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు పెరుగుతున్నాయి. ఎందుకంటే చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయకపోవడంతో రాజస్థాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. ఫలితంగా, ఐపీఎల్ సిరీస్‌లో రాజస్థాన్ జట్టు స్వయంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సంచలన ఆరోపణలు చేశారు.

Story first published: Wednesday, April 23, 2025, 21:51 [IST]
Other articles published on Apr 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+