యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అదరగొడుతున్నాడు. తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో జార్ఖండ్‌కు నాయకత్వం వహిస్తున్న ఇషాన్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 114 బంతుల్లో 107 పరుగులు చేసిన ఇషాన్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 41 పరుగులు చేశాడు.
జార్ఖండ్ విజయానికి 12 పరుగులు అవసరమైన స్థితిలో ఇషాన్ కిషన్ వరుస సిక్సర్లతో చెలరేగాడు. అయితే ఆ సమయంలో జార్ఖండ్ చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో విజయం కోసం మధ్యప్రదేశ్ గొప్పగానే పోరాడింది. కానీ ఇషాన్ మధ్యప్రదేశ్‌కు అవకాశం ఇవ్వలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాన్ 86 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం.

కాగా, ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత ఇషాన్ కిషన్ ఆడుతున్న తొలి ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ ఇదే. గతంలో దేశవాళీ క్రికెట్ ఆడకుండా బీసీసీఐ ఆగ్రహానికి గురై.. సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు భారత జట్టులో చోటు కోల్పోయాడు. వచ్చే 4 నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుండటంతో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇషాన్ కిషన్ శ్రమిస్తున్నాడు.
ఈ క్రమంలోనే అతను దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న బుచ్చి బాబు టోర్నీతో పాటు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు.కాగా, ఏడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ బుచ్చిబాబు టోర్నీలో మొత్తం 12 జట్లు బరిలో నిలిచాయి.
బరిలోకి దిగే జట్లు
గ్రూప్ ఏ: మధ్యప్రదేశ్, జార్ఖండ్, హైదరాబాద్
గ్రూప్ బి: రైల్వేస్, గుజరాత్, టీఎన్‌సీఏ ప్రెసిడెంట్ ఎలెవెన్
గ్రూప్ సి: ముంబై, హర్యానా, టీఎన్‌సీఏ ఎలెవెన్
గ్రూప్ డి: జమ్మూ కశ్మీర్, బరోడా, చత్తీస్‌గఢ్
Ishan Kishan - the hero of Jharkhand !!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024
- Jharkhand needed 12 with 2 wickets in hands, captain smashed 6,0,6 to seal the game. pic.twitter.com/3uTqFF1KI2