Ishan Kishan: సెలెక్టర్లు చేసిందే కరెక్ట్.. వాళ్లు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఆగస్టు 27న ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు లెఫ్టార్మ్ ఓపెనర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఎంపిక కాని సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇషాన్ తన స్పందనను వెల్లడించాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ఆగస్టు 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో ఆసియాకప్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక భారత జట్టు సెలెక్షన్ పట్ల చాలా విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇషాన్ కిషన్ ఎంపిక కాకపోవడం పట్ల కొందరు.. పంత్ మినహా అందరూ రైట్ హ్యాండర్లే అయితే ఎలా అంటూ కామెంట్లు సైతం వచ్చాయి.

కోహ్లీ, రాహుల్ ఎంట్రీ ఇవ్వడంతో..
విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ లాంటి స్టార్లు భారత జట్టుకు తిరిగి ఎంట్రీ ఇవ్వడంతో.. ఆసియా కప్ జట్టులో ఇషాన్ కిషన్‌కు స్థానం దక్కలేదు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 గేమ్‌లో ఇషాన్‌కు అవకాశమొచ్చింది. అయితే అతను 13 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయినప్పటికీ.. ఇప్పటివరకు 2022లో ఇషాన్ కిషన్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. టీ20ల్లో 30.71 సగటుతో 430పరుగులతో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా రెండో ఆటగాడిగా నిలిచాడు. కిషన్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 89. అతను మూడు హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు.

ఈ విషయాన్ని నేను సానుకూలంగా తీసుకుంటా
తాను ఎంపిక కాకపోవడం పట్ల ఇషాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఈ విషయాన్ని నేను అత్యంత సానుకూలంగా తీసుకుంటున్నానని చెప్పాడు. మరోసారి సెలెక్టర్లు తనను ఎంపిక చేసేలా కృషి చేస్తానని చెప్పాడు.'సెలెక్టర్లు చేసేది న్యాయమైనదని నేను భావిస్తున్నాను. ఆటగాళ్లను ఎంపిక చేసుకునేటప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనే విషయంపై వారు చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. నేను ఎంపిక కాకపోవడాన్ని నేను పాజిటివ్ కోణంలో తీసుకుంటాను. నేను మరింత కష్టపడి ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు సెలెక్టర్లు నాపై విశ్వాసం ఉంచుతారు. వారు తప్పకుండా నన్ను జట్టులో సెలెక్ట్ చేస్తారు.' అని పేర్కొన్నాడు.

ఆసియా కప్ 2022 కోసం ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్
స్టాండ్‌బై ప్లేయర్స్: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications