Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘మనల్ని ఫ్లవర్ అనుకుంటున్నారు.. మనం ఫైర్ అని చూపించాలి’.. ఇన్‌స్టాలో ఇషాన్ కిషన్ పోస్ట్

Ishan Kishan Intresting Post On Instagram after Not Selecting to Asia cup

సోమవారం ప్రకటించిన ఆసియా కప్ 2022 కోసం భారత జట్టులో పలువురు మంచి ప్లేయర్లకు మొండిచేయి ఎదురైంది. సీనియర్లు అందుబాటులోకి రావడంతో జూనియర్ స్టార్లకు నిరావ తప్పలేదు. ఇక ఆసియాకప్ టీంకు మిస్సయిన ప్లేయర్లలో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఒకడు. టీ20ల్లో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఎంత దుందుడుకు ప్లేయరో అందరికీ తెలిసిందే. పైగా భారత జట్టులో పంత్ తప్పా ఒక్క లెఫ్టాండర్ స్పెషలిస్ట్ బ్యాటర్ లేడు. దీంతో కిషన్‌కు చోటు దక్కడం ఖాయమనే అంత అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతన్ని సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు.. పైగా కనీసం స్టాండ్ బైలో కూడా ఉంచలేదు.

హిందీలో కొన్ని పంక్తులను పోస్ట్‌లో పేర్కొంటూ

ఇక సెలెక్షన్ అనంతరం ఇషాన్ కిషన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. సెలెక్ట్ కానందుకు ఇషాన్ చాలా బాధపడి ఉండొచ్చని ఆ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. అలాగే అతను ఈ నిరాశజనక పరిస్థితి నుంచి ఎలా బయటపడాలనే విషయాన్ని బెల్లా రాసిన 'హంబుల్ పోయెట్' కవితలోని కొన్ని పంక్తులను ఉదాహరిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. 'అబ్ ఐసా బన్నా నహీ, భలే ఘయల్ హో జానా. తుఝే ఫూల్ సంజే కోయి, తు ఫైర్ హో జానా' అని హిందీ పంక్తులను పేర్కొన్నాడు. 'మీకు బాధ కలిగించే పరిస్థితుల్లో మీరు నిరాశ చెందొద్దు. ఎవరైనా మిమ్మల్ని ఓ ఫ్లవర్ లాగా భావించుడొచ్చు. మీరు ఫ్లవర్ కాదు ఫైర్ అని చూపించేలా మారండి.' అని ఈ పదాలకు మీనింగ్.

ఐపీఎల్లో భారీ ధర

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో ₹15.5 కోట్ల భారీ మొత్తానికి ఇషాన్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో అతను రాణించలేకున్నా.. మళ్లీ పుంజుకున్నాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో ఇషాన్ మూడు అర్ధ సెంచరీలతో సహా 32.15 సగటుతో 418పరుగులు చేశాడు. ఇషాన్ జూన్‌లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆ సిరీస్లో కూడా రెండు అర్ధ సెంచరీలు చేశాడు.

వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో పేలవంగా..

వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో పేలవంగా..

ఇక ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ పర్యటనలలో ఇషాన్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఆరు టీ20 గేమ్‌లలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. చివరి ఆరు అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో అతని స్కోర్లు 27, 15, 3, 8, 11గా ఉన్నాయి. దీని వల్లే సెలెక్టర్లు కిషన్‌ను ఎంచుకోవడానికి కాస్త సంకోచించినట్లు కన్పించింది. పదే పదే ఫ్రంట్ ఫుట్ షాట్లు ఆడుతూ వికెట్ చేజార్చుకుంటున్న ఇషాన్‌‌కు ఇప్పుడు భారీ మూల్యం తప్పలేదు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత అదే టెంపో కంటిన్యూ చేసి ఉంటే అతను తప్పకుండా ఆసియాకప్‌కు సెలెక్ట్ అయ్యేవాడు. అయినప్పటికీ 2022లో 14 టీ20 ఇన్నింగ్స్‌లో అతను 142.99 స్ట్రైక్ రేట్‌తో 44.90సగటుతో 449 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, August 10, 2022, 17:20 [IST]
Other articles published on Aug 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+