దక్షిణాఫ్రికా బౌలర్ల తుక్కురేగ్గొట్టిన టీమిండియా.. ఆరంభంలో ఇషాన్ కిషన్, అంతంలో పాండ్యా, పంత్ విధ్వంసం

దక్షిణాఫ్రికా బౌలింగ్ తుక్కు రేగ్గొట్టిన ఇండియా బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్ ఉంచారు. పాకెట్ డైనమైట్ (76పరుగులు 48బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు) విధ్వంసం రేపగా.. చివర్లో కెప్టెన్ రిషబ్ పంత్ (29పరుగులు 16బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (31పరుగులు 12బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) దడదడలాడించడంతో టీమిండియా స్కోరు బోర్డు రాకెట్లా దూసుకెళ్లింది. ఇక సౌతాఫ్రికా గెలవాలంటే 212పరుగుల లక్ష్యాన్ని చేదించాల్సి ఉంటుంది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ , ప్రిటోరియస్, పార్నెల్ , నార్జ్ తలా ఓ వికెట్ తీశారు
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవ్వాళ అయిదు టీ20 మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభమైంది. సిరీస్‌లో భాగంగా ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20ఓవర్లకు 4వికెట్లు కోల్పోయి 211పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరి నేతృత్వంలోనే టీమిండియా దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.

పవర్ ప్లేలో శుభారంభం
ఇక టీమిండియాకు మంచి శుభారంభం దక్కింది. తొలి ఓవర్లోనే పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు కొట్టి హిట్టింగ్ ప్రారంభించాడు. తొలి ఓవర్లో ఇండియాకు 13పరుగులొచ్చాయి. ఇక మూడో ఓవర్లో నార్జ్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. టచ్‌లోకి వచ్చాడు. వీరిద్దరు అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇక పవర్ ప్లే చివరి ఓవర్ అయిన 6వ ఓవర్లో గైక్వాడ్ సిక్స్, ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు కొట్టి ఆ ఓవర్లో 15పరుగులు పిండుకున్నారు. తద్వారా పవర్ ప్లే పూర్తయ్యేసరికి భారత్ స్కోరు వికెట్లేమీ కోల్పోకుండా 51పరుగులకు చేరుకుంది.

పవర్ ప్లేలో శుభారంభం
ఇక టీమిండియాకు మంచి శుభారంభం దక్కింది. తొలి ఓవర్లోనే పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు కొట్టి హిట్టింగ్ ప్రారంభించాడు. తొలి ఓవర్లో ఇండియాకు 13పరుగులొచ్చాయి. ఇక మూడో ఓవర్లో నార్జ్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. టచ్‌లోకి వచ్చాడు. వీరిద్దరు అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇక పవర్ ప్లే చివరి ఓవర్ అయిన 6వ ఓవర్లో గైక్వాడ్ సిక్స్, ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు కొట్టి ఆ ఓవర్లో 15పరుగులు పిండుకున్నారు. తద్వారా పవర్ ప్లే పూర్తయ్యేసరికి భారత్ స్కోరు వికెట్లేమీ కోల్పోకుండా 51పరుగులకు చేరుకుంది.

సింపుల్ స్టంపౌట్ మిస్ చేసిన క్వింటన్ డికాక్
పార్నెల్ వేసిన 7ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన గైక్వాడ్ (23పరుగులు 15బంతుల్లో) రెండో బంతికి ఔటయ్యాడు. దీంతో ఇషాన్ కిషన్, రుతురాజ్ మధ్య 57పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ సైతం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 8వ ఓవర్ షమ్సీ బౌలింగ్లో సిక్స్ కొట్టి శ్రేయస్ టచ్‌లోకి వచ్చాడు. 10వ ఓవర్లో కూడా శ్రేయస్ రెండు సిక్సులు బాదాడు. ఇక శ్రేయస్ 25పరుగుల వద్ద క్వింటన్ డికాక్ స్టంపౌంట్ మిస్ చేయడంతో బతికిపోయాడు. ఇక 11ఓవర్లో సిక్స్ బాదిన ఇషాన్ 38బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

చివర్లో చెలరేగిన హార్దిక్ పాండ్యా, పంత్
13వ ఓవర్ మహారాజ్ వేయగా.. ఇషాన్ కిషన్ వీర లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. వరుసగా రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదాడు. 5వ బంతికి ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నా 6వ బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక 14ఓవర్ తొలి బంతికి రిషబ్ పంత్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 17వ ఓవర్ తొలిబంతికి శ్రేయస్ అయ్యార్ (36పరుగులు 27బంతుల్లో 1ఫోర్, 3సిక్సులు)ను ప్రిటోరియస్ పెవిలియన్‌కు పంపించాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చివర్లో స్కోరుబోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించారు.

సౌతాఫ్రికా మీద టీమిండియా అత్యధిక స్కోరు ఇదే
17వ ఓవర్ చివరి రెండు బంతులకు పంత్ రెండు సిక్సులు బాదాడు. 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఫోరు, సిక్స్ బాదాడు. 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యా సిక్స్, ఫోర్ బాదాడు. ఇక చివరి ఓవర్ తొలి బంతికి పంత్ ఔటయ్యాడు. చివరి ఓవర్లో హార్దిక్ ఒక సిక్స్ కొట్టడంతో చివరి ఓవర్లో 9పరుగులొచ్చాయి. క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్‌కు హిట్టింగ్ చేయడానికి తగినంత టైం దొరకలేదు. ఇక 20ఓవర్లకు ఇండియా 4వికెట్లు కోల్పోయి 211పరుగులు చేసింది. ఇక తద్వారా టీ20ల్లో సౌతాఫ్రికా మీద అత్యుత్తమ స్కోరును టీమిండియా సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications