Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందానికే అసూయ పుట్టించేలా ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్.. నేటి మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్

aditi hundia

ముంబైలోని వాంఖడే వేదికగా ఈరోజు రాత్రి 7.30గంటలకు ప్రారంభమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాటం ఓ వైపు.. ఈ మ్యాచ్ గెలిచి సీజన్‌ను గౌరవప్రదంగా ముగించాలని పోరాటం ఓ వైపు పోరాడుతున్నట్లు మ్యాచ్ సాగతోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే గనుక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్లేఆఫ్స్ చేరుతుంది. ఓడితే ఢిల్లీ ప్లేఆఫ్ చేరుతుంది. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 159పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ (39పరుగులు 33బంతుల్లో 4ఫోర్లు 1సిక్సర్), రోవ్ మెన్ పావెల్ (43పరుగులు 34బంతుల్లో 1ఫోర్ 4సిక్సర్లు) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు.
aditi

సందడి చేసిన ఇషాన్ గర్ల్ ఫ్రెండ్

ఇక ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. రోహిత్ పూర్తిగా తడబడ్డాడు. మరో వైపు 2వ ఓవర్లో ఇషాన్ కిషన్ నార్జే బౌలింగ్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి హిట్టింగ్ ప్రారంభించాడు. మరోవైపు రోహిత్ పూర్తిగా తడబడుతూ స్కోరుచేయకపోగా.. ఈ క్రమంలో 4వ ఓవర్లోనూ ఇషాన్ సిక్సర్ కొట్టాడు. దీంతో ముంబై అభిమానులు అతన్ని చీర్ చేశారు. ఇక ముంబై అభిమానుల్లో ఓ స్పెషల్ పర్సన్ కూడా కెమెరాకు కన్పించి ఆకట్టుకుంది. ఆమె ఎవరో కాదు ఇషాన్ కిషన్ గర్లఫ్రెండ్. అప్పుడప్పుడు ముంబై ఇండియన్స్ ఆడుతుంటే స్టేడియంలోకి వచ్చి ఉత్సాహపరిచే ఆమె ఈ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా కన్పించి సందడి చేసింది.

aditi 3

గర్ల్ ఫ్రెండ్ చూస్తుందని చెలరేగాడు
ఇంతకీ ఆమె పేరు ఏంటంటే అదితి ఉండియా. అయితే వీరిద్దరు మాత్రం అధికారికంగా తాము రిలేషన్లో ఉన్నట్లు మాత్రం ఎప్పుడూ వెల్లడించలేదు. ఇది కేవలం ఊహగానం మాత్రమే. అయినప్పటికీ ఇషాన్ కిషన్ కు, ముంబై ఇండియన్స్ కు ఆమె బిగ్గెస్ట్ సపోర్టర్ గా ఉండడం, అలాగే ఇన్ స్టాలో ఆమె పెట్టే పోస్టులకు ఇషాన్, ఇషాన్ పెట్టే పోస్టులకు అదితి రిప్లేలు ఇచ్చుకోవడం, అలాగే పలుసార్లు ఇద్దరు కెమెరా కంటపడడంతో వారు రిలేషన్లో ఉన్నట్లు వార్తలు మాత్రం ఊపందుకున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో గర్ల్ ఫ్రెండ్ చూస్తుందని ఇషాన్ (48పరుగులు 35బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) చెలరేగాడు. త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.

అదితి హుండియా గురించి..
ఇక పోతే అదితి హుండియా 2019లో హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు మద్దతిస్తూ సెలెబ్రేషన్స్ చేసుకోవడం అప్పట్లో కాస్త వైరలైంది. అప్పుడు తన అందంతో అదితి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అదితి గురించి చెప్పుకోవాలంటే ఆమె ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్‌గా కిరీటాన్ని పొందింది. అదితి మిస్ దివా 2018 మొదటి రన్నరప్‌గా కిరీటాన్ని పొందింది. ఆమె మిస్ సుప్రానేషనల్ 2018 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఆమెకు ఇష్టమైన క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ. ఇక ఆమె ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతుంటుంది. ఆమెకు ఇన్ స్టాలో 2.7లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు.

Story first published: Saturday, May 21, 2022, 22:44 [IST]
Other articles published on May 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+