Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్ అనంతరం స్టాండ్స్‌లో ఇషాన్ కిషన్ సందడి..! దురదృష్టవశాత్తూ అది కోల్పోయాడటా...!

Ishan Kishan Gave Selfies and Autographs to Fans After 2nd ODI win As Ranchi was His Home Ground

ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ విజయం తర్వాత భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. తన హోం గ్రౌండ్ అయిన రాంచీ స్టేడియానికి మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులను ప్రత్యేకంగా పలకరించాడు.

స్టాండ్స్‌లో కలియ తిరుగుతూ అభిమానులతో సెల్ఫీలు దిగాడు. డొమెస్టిక్ క్రికెట్లో జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ ఆడిన సంగతి తెలిసిందే. బిహార్ వాసి అయినప్పటికీ.. జార్ఖండ్‌లోని రాంచీ స్టేడియంతో ఇషాన్‌కు మంచి అనుబంధం ఉంది. చాలా మ్యాచ్‌లు ఇక్కడ ఆడాడు. మ్యాచ్ అనంతరం ఇక స్టాండ్స్‌లో ఇషాన్ కిషన్ సందడి చేస్తున్న వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. ఇకపోతే ఓ అభిమాని.. పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు ఇవ్వాలని.. ఓ లెటర్ ఇచ్చాడు. అందులో శార్దూల్ ఠాకూర్ 54 పేరుతో లవ్ సింబల్ ఉంది. దాన్ని ఇషాన్ తీసుకెళ్లి శార్దూల్‌కు అందించాడు. దీన్ని అంతటిని బీసీసీఐ వీడియో టీం క్యాప్చర్ చేయడం ఆకట్టుకుంది.

ఫీల్డింగ్ టైంలో నన్ను సెంచరీ చేయాలని కోరారు.

ఇక ఈ మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగుల తేడాతో తన తొలి వన్డే సెంచరీని ఇషాన్ మిస్సయ్యాడు. అయినప్పటికీ తన ఫుల్ షాట్లతో అలరించాడు. మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ పట్ల మంచి అనుభూతి ఉంది. ప్రస్తుతం మేం 1-1తో సిరీస్ సమం చేశాం. ఢిల్లీలో డిసైడర్‌ మ్యాచ్ ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇది నా హోమ్ గ్రౌండ్. నేను ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వాళ్లు నా నుంచి ఈరోజు సెంచరీ చేయాలంటూ కోరారు. దురదృష్టవశాత్తూ నేను దాన్ని కోల్పోయాను. అయిన చింతించను. ఎందుకంటే మా జట్టు ఈరోజు గేమ్‌లో గెలిచినందుకు సంతోషంగా ఉన్నాను. తదుపరి గేమ్‌లో నేను నా బెస్ట్‌ను అందించి నా జట్టును మళ్లీ గెలిపించేలా చేయాలనుకుంటున్నా.

ముందే షాట్ నిర్ణయించుకోకూడదు

ఈ పిచ్ మీద కొన్నిసార్లు రాణించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా మ్యాచ్‌లు ఆడాను. కొత్త బ్యాటర్లకు పరుగులు చేయడం అంత సులభం కాదు. సౌతాఫ్రికా జట్టులో నార్జ్, రబడా చాలా వేగవంతమైన బాల్స్ వేస్తున్నారు. అవి కొన్నిసార్లు నేరుగా మొఖానికేసి దూసుకొస్తున్నాయి. మధ్య మధ్యలో స్లోయర్స్ వేస్తూ సడెన్‌గా స్పీడ్ వేస్తుండడంతో కాస్త అటూ ఇటూ అవుతుంది. ఏదేమైనా బంతి ప్రకారం ఆడాలి కానీ ముందే షాట్ నిర్ణయించుకుని ఆడకూడదని ప్లాన్ చేస్తూ ఆడాను. వీలయినంత వరకు బంతిని గ్యాప్‌లో బాదడానికే ప్రయత్నించాను. అది కాస్త వర్కవుట్ అయింది.

శ్రేయస్, ఇషాన్ రాణించడంతో..

శ్రేయస్, ఇషాన్ రాణించడంతో..

రెండో వన్డేలో పుంజుకున్న భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఐడెన్ మార్క్రామ్ (79), రీజా హెండ్రిక్స్ (74) అద్భుతంగా ఆడడంతో తొలుత ప్రోటీస్ 7వికెట్లు కోల్పోయి 278 పరుగుల స్కోరు చేసింది. అయితే ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడారు. అయ్యర్ (113) సెంచరీతో రాణించడంతో పాటు ఇషాన్ (93) పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడడంతో 46ఓవర్లలోనే భారత్ గెలుపొందింది.

Story first published: Monday, October 10, 2022, 11:02 [IST]
Other articles published on Oct 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+