County Championship: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు చాలా కాలంగా సరిగా లేవు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌లపై కూడా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాకిస్థానీ బౌలర్‌తో కలిసి ఆడుతూ కనిపించాడు. దీని కారణంగా చాలా మంది అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
పాకిస్థాన్ ఆటగాడితో ఇషాన్ కిషన్
వికెట్ కీపర్ -బ్యాటర్ ఇషాన్ కిషన్ గత 18 నెలలుగా టీమిండియాలో లేడు. ఒకప్పుడు ప్రధాన వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఉన్న ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీమిండియాలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం ఇషాన్ కిషన్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడుతున్నాడు. ఈ జట్టులో పాకిస్థానీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ కూడా ఉన్నాడు. ఒక మ్యాచ్‌లో మొహమ్మద్ అబ్బాస్ బౌలింగ్‌లో క్యాచ్ రాగా.. దానిని వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సంబరాలు చేసుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు అభిమానులు దీనిపై ఇషాన్ కిషన్‌ను ప్రశ్నిస్తున్నారు.

బ్యాటింగ్‌లోనూ మెరిసిన ఇషాన్ కిషన్
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అక్కడ ఇషాన్ కిషన్ కేవలం 98 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కిషన్ 12 ఫోర్లు, 1 సిక్స్ కూడా కొట్టాడు. నాటింగ్‌హామ్‌షైర్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రోజు ఆట ముగిసే సమయానికి యార్క్‌షైర్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ చాలా కాలంగా దేశీయ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ ఇప్పటికీ టీమ్ ఇండియాలోకి తిరిగి రాలేకపోతున్నాడు.