పిక్చర్ అబీ బాకీ హై: ఇషాన్ కిషన్ మాస్ వార్నింగ్!
రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 228 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛేదించిన అనంతరం ఇషాన్ కిషన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్యాట్ కమిన్స్ మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం తనపై ఒత్తిడిని తగ్గించిందని ఇషాన్ పేర్కొన్నాడు. ప్యాట్ కమిన్స్ జట్టులోకి రావడంతో బౌలింగ్ బలం పెరగడమే కాకుండా.. నాయకత్వ అనుభవం జట్టుకు ఎంతో ప్లస్ అయిందని చెప్పాడు. గత ఏడు మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేయడం బాగున్నప్పటికీ.. కమిన్స్ రాకతో తాను ఇప్పుడు కేవలం బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలుగుతున్నానని తెలిపాడు.
ఆ రికార్డు రన్ ఛేజ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..
ఈ భారీ లక్ష్య ఛేదనలో పవర్ ప్లే వ్యూహం గురించి ఇషాన్ కిషన్ వివరిస్తూ.. 228 వంటి లక్ష్యాలను ఛేదించాలంటే పవర్‌ప్లేలో ధాటిగా ఆడటం చాలా ముఖ్యమని చెప్పాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నప్పుడు మిగిలిన బ్యాటర్ల పని సులభతరం అవుతుందని వారిని ప్రశంసించాడు. తాను క్రీజులో ఉన్నప్పుడు అభిషేక్ శర్మతో ఎప్పటికప్పుడు రన్-రేట్, ఆట పరిస్థితి గురించి చర్చిస్తూ బ్యాటింగ్ చేశానని.. అదే ఈ చారిత్రాత్మక విజయానికి పునాది వేసిందని ఇషాన్ కిషన్ వెల్లడించాడు.

జోఫ్రా ఆర్చర్ స్పీడ్‌కు భయపడలేదు..
రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేగాన్ని ఎదుర్కోవడంపై స్పందిస్తూ.. ఆర్చర్ బౌలింగ్ ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా, బౌన్స్‌తో వస్తోందని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా షాట్లు ఆడానని.. అదృష్టమెప్పుడూ ధైర్యవంతుల పక్షాన ఉంటుందని పేర్కొన్నాడు. వైఫల్యం గురించి భయపడకుండా, తనపై తనకు నమ్మకం ఉంచి కేవలం బంతిపై మాత్రమే దృష్టి పెట్టానని, మైదానంలోని గ్యాప్‌లను వాడుకుంటూ రన్-రేట్ తగ్గకుండా చూశానని వివరించాడు.
బీహార్ బుల్లోడి గర్జన
చివరగా తన ఫామ్ గురించి మాట్లాడుతూ ప్రత్యర్థి జట్లకు ఇషాన్ కిషన్ ఓ హెచ్చరిక జారీ చేశాడు. ఇది తన అత్యుత్తమ బ్యాటింగా అని ప్రశ్నించగా.. "లేదు, నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా రావాల్సి ఉంది" అని ధీమాగా చెప్పాడు. తాను ఇంకా దూకుడుగా, నిర్భయంగా ఆడబోతున్నానని చెప్పడం ద్వారా ఈ సీజన్‌లో మరిన్ని మెరుపులు మెరిపిస్తానని ఇషాన్ కిషన్ స్పష్టం చేశాడు. బీహార్‌కు చెందిన ఈ లిటిల్ డైనమైట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications