IPL 2022: సీజన్‌లోనే ఎక్కువ ధరకు ఇషాన్ కిషన్‌ను మళ్లీ దక్కించుకున్న ముంబై! ఎంతంటే?

బెంగళూరు: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు ఐపీఎల్ 2022 మెగా వేలంలో అదృష్టం కలిసొచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సారి ఇప్పటివరకు జరిగిన వేలంలో అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. అది కూడా తన పాత టీం ముంబై ఇండియన్సే కిషన్‌ను కొనుగోలు చేయడం గమనార్హం. ఇషాన్ కిషన్ వేలంలో భారీ ధర పలుకుతాడని మొదటి నుంచి అంచనాలున్నాయి. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో వేలంలో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ 15 కోట్ల 25 లక్షల రూపాయల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ముంబైకి కిషన్ అంత సులువుగా లభించలేదు. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఆ ఫ్రాంచైజీకి గట్టి పోటీ ఎదురైంది. సన్‌రైజర్స్ చివరి వరకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
గతేడాది ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు అప్పుడు ఆ జట్టు 6 కోట్ల 20 లక్షల రూపాయలు చెల్లించింది. కానీ మంచి ఫామ్‌లో ఉన్న కిషన్‌ను రిటెన్సన్ జాబితాలో చేర్చుకోలేదు. కానీ వేలంలో మాత్రం వదలకుండా భారీ ధర అయినా సరే వెచ్చించి కొనుగోలు చేసింది. వేలంలో ఎంత ధరైనా సరే వెచ్చించి కొనుగోలు చేయాలని ముంబై ఇండియన్స్ ముందే భావించి బెంగళూరులో అడుగు పెట్టినట్లుంది. అందుకే ఇషాన్ కిషన్ పేరు రాగానే ఏ మాత్రం తగ్గకుండా రేటు పెంచుకుంటూ పోయింది. ఇతరులను నుంచి పోటీ ఎదురైనా లెక్క చేయలేదు. చివరికి తాము అనుకున్నట్లు ఇషాన్ కిషన్ దక్కడంతో ముంబై ఇండియన్స్ ఓనర్లు వేలంలోనే చిన్నపాటి సంబరాలు కూడా చేసుకున్నారు. కాగా గతంలో కన్నా కిషన్‌కు ఈ సారి ముంబై 9 కోట్ల 5 లక్షల రూపాయలు ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేయడం విశేషం. ఈ ధర గతంలో రెండింతల కన్నా ఎక్కువ.
ఇప్పటివరకు జరిగిన మెగా వేలంలో ఇషాన్ కిషన్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 12 కోట్ల 25 లక్షల రూపాయలకు దక్కించుకుంది. ఆ తర్వాత మూడో స్థానంలో టీమిండియా యువ పేసర్ హర్షల్ పటేల్, శ్రీలంక స్పిన్నర్ వనిండు హసరంగ ఉన్నారు. హర్షల్ పటేల్‌ను 10 కోట్ల 75 లక్షల రూపాయలు చెల్లించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ కొనుగోలు చేయగా.. హసరంగను కూడా 10 కోట్ల 75 లక్షల రూపాయలకు అదే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications