'సోషల్ మీడియాపై కాదు.. ఆటపై దృష్టి పెట్టు': బుడ్డోడికి క్లాస్ పీకిన స్టార్ క్రికెటర్!
ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం అత్యంత సంచలనంగా మారిన యువ ఆటగాళ్లలో టీమిండియా యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఒకడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి అద్భుతమైన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వైభవ్ సూర్యవంశీ ఎలాంటి ఇబ్బంది పడకుండా అక్కడి వాతావరణంలో త్వరగా సర్దుకుపోయేలా జట్టులోని సభ్యులంతా అతనికి పూర్తి సహకారం అందిస్తున్నట్లు వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ వెల్లడించాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి క్రికెట్‌పై దృష్టి పెట్టమని జట్టులోని సీనియర్ ప్లేయర్లు వైభవ్ సూర్యవంశీకి సలహాలు ఇస్తున్నట్లు ఇషాన్ కిషన్ తెలిపాడు.
వైభవ్ సూర్యవంశీకి ఇషాన్ కిషన్ క్లాస్
వైభవ్ సూర్యవంశీ తన కెరీర్ ఆరంభంలో సీనియర్ ప్లేయర్ల అనుభవం నుంచి నేర్చుకుని ఎలాంటి ప్రతికూల దృష్టికి, పరధ్యానాలకు దూరంగా ఉండాలని జట్టు కోరుకుంటోందని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు. జట్టులో ఇంతటి టాలెంటెడ్ యువ ప్లేయర్ ఉన్నప్పుడు అతను తప్పుడు కారణాల వల్ల పరధ్యానంలో పడకూడదని తాము కోరుకుంటామన్నాడు. తనతో పాటు అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్‌తో పాటు మరికొందరు సీనియర్ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీకి ఎప్పుడూ మార్గదర్శనం చేస్తుంటామని.. బయటి గందరగోళం నుంచి అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటామని చెప్పాడు.

వైభవ్ మా ప్రాంతానికి చెందినవాడు: ఇషాన్ కిషన్
జట్టు మొత్తం ఓ కుటుంబం లాంటిదని.. తాము చేసిన తప్పులను వైభవ్ సూర్యవంశీ చేయకూడదని ఆటగాళ్లందరూ కోరుకుంటున్నారని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు. అందులోనూ వైభవ్ సూర్యవంశీ తన సొంత ప్రాంతానికి చెందినవాడు కావడంతో అతడిని సంతోషంగా ఉంచడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఇషాన్ కిషన్ తెలిపాడు. దాంతో పాటు ముఖ్యమైన వాటిపై దృష్టి సారించేలా చేయడం మా బాధ్యత అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆస్వాదిస్తున్నట్లే వైభవ్ తన క్రికెట్‌ను ఆస్వాదించాలని ఇషాన్ కిషన్ కోరుకున్నాడు.
వైభవ్ బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ప్రశంసల వర్షం
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ ఇషాన్ కిషన్ ఇలా అన్నాడు. "వైభవ్ సూర్యవంశీ చాలా తెలివైన ఆటగాడు. మైదానంలో ఎలా బ్యాటింగ్ చేయాలో.. స్టేడియం లోపల, వెలుపల ఎలా ప్రవర్తించాలో అతనికి బాగా తెలుసు. వైభవ్ క్రీజ్‌లో నిలదొక్కుకుంటే, జట్టుకు పెద్ద మార్పు తీసుకురాగలడు. తొలి బంతి నుంచే దాడి చేయగల బ్యాట్స్‌మెన్, పవర్‌ప్లేలో జట్టు 80-90 పరుగులు చేయడానికి సహాయపడగలడు." అంటూ ఇషాన్ కిషన్ వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

