For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాయ్‌పూర్‌లో రచ్చ: ఇషాన్‌ను హత్తుకున్న సూర్య! (వీడియో)

Ishan Kishan 76 vs New Zealand : న్యూజిలాండ్ జట్టుతో రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు సంజూ శాంసన్(6), అభిషేక్ శర్మ(0) త్వరగానే ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. కానీ మూడో నంబర్‌లో వచ్చిన ఇషాన్ కిషన్( Ishan Kishan 76 vs New Zealand) కివీస్ బౌలర్లపై సింహస్వప్నంలా విరుచుకుపడ్డాడు.

200 స్ట్రైక్‌రేట్‌తో విధ్వంసం

ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లోనే 76 పరుగులు చేసి మైదానాన్ని హోరెత్తించాడు. ఇందులో 11 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇషాన్ ఇన్నింగ్స్ ఎంత వేగంగా సాగిందంటే.. అతడి స్ట్రైక్ రేట్ 237.5గా నమోదైంది. ఇషాన్ కిషన్ ఆడుతున్న తీరు చూసి కివీస్ బౌలర్లు బంతులు ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.

Ishan Kishan 76 vs New Zealand Leads India to Victory Suryakumar and Gambhir Praise Outing

సూర్య-ఇషాన్ తుఫాన్ ఇన్నింగ్స్

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఇషాన్ కిషన్ కేవలం 48 బంతుల్లోనే 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేసింది. చివరకు ఇష్ సోథీ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఔట్ అయినప్పుడు.. సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ముందుకు వచ్చి ఇషాన్ కిషన్ ను హత్తుకుని అభినందించడం మైదానంలో హైలైట్‌గా నిలిచింది.

గౌతమ్ గంభీర్ ప్రశంసలు

ఇషాన్ కిషన్ ఔట్ అయిన తర్వాత డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్ స్టేడియంలోకి వచ్చారు. సాధారణంగా సీరియస్‌గా ఉండే గంభీర్.. ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్‌కు ముగ్దుడై అతడి వీపు తట్టి శభాష్ అని మెచ్చుకున్నారు. డగౌట్‌లోకి చేరుకున్న ఇషాన్‌ కిషన్‌కు సహచర ఆటగాళ్లందరూ నిలబడి స్వాగతం పలికారు.

కివీస్ భారీ స్కోరును చిత్తు చేసిన భారత్

అంతకుముందు బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ (47*) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కీలకమైన రెండు వికెట్లు తీసి కివీస్‌ను కట్టడి చేశాడు. చివరకు భారత్ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

Story first published: Saturday, January 24, 2026, 13:23 [IST]
Other articles published on Jan 24, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+