
దక్షిణాఫ్రికాతో కటక్‌లో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టెంబా బవుమా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలుత ఇషాన్ కిషన్ (34పరుగులు 21బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) ధాటిగా ఆడగా.. మధ్యలో శ్రేయస్ అయ్యర్ (40పరుగులు 35బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), చివర్లో దినేష్ కార్తీక్ (30పరుగులు 21బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు నాటౌట్) రాణించడంతో 20ఓవర్లకు 6వికెట్లు కోల్పోయి 148పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నార్జ్ 2వికెట్లు తీయగా.. రబాడా 4ఓవర్లలో 15పరుగులే ఇచ్చి 1వికెట్ తీసి రాణించారు. ఇక పార్నెల్, ప్రిటోరియస్, మహరాజ్ తలా ఒక వికెట్ తీసి టీమిండియాను కట్టడి చేశారు.
ఇషాన్ కిషన్ కాసేపు దడదడలాడించినా..
బ్యాటింగ్లో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ వేసిన కగిసో రబాడ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను (1పరుగు, 4బంతుల్లో) క్యాచ్ ఔట్ చేశాడు. ఇక క్రీజులోకి వచ్చిన వన్ డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ మాత్రం ధాటిగా ఆడాడు. అన్రిచ్ నార్జ్ వేసిన 4వ ఓవర్లో ఇషాన్ రెండు సిక్సులు కొట్టి స్కోరు బోర్డుకు మూమెంటమ్ తీసుకొచ్చాడు. శ్రేయస్ కూడా అడపాదడపా ఫోర్లు కొట్టాడు. వీరిద్దరి జోడీ 2వికెట్‌కు 45పరుగుల భాగస్వామ్యమందించారు. ఇక నార్జ్ వేసిన 7వ ఓవర్లో ఫోర్ కొట్టిన ఇషాన్.. బౌన్సర్ బాల్ హిట్ చేయాలని చూసి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక 9వ ఓవర్ తబ్రైజ్ షమ్సీ వేయగా.. ఆ ఓవర్లో శ్రేయస్ ఫోర్, సిక్సర్ బాదడంతో ఆ ఓవర్లో 14పరుగులొచ్చాయి.
4ఓవర్ల పాటు బౌండరీ రాలేదు
ఇషాన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ (5పరుగులు 7బంతుల్లో) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్లో అనవసర షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. ఇక పంత్ ఔటవ్వడంతో స్కోరు బోర్డు వేగం మందగించింది. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యార్ క్రీజులో భారీ షాట్లు ఆడలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లు మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. 13వ ఓవర్ పార్నెల్ వేయగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9పరుగులు 12బంతుల్లో) బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. 14వ ఓవర్లో ప్రిటోరియస్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ కీపర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో స్కోరు వేగం పూర్తిగా మందగించింది. ఇక మిడిల్ ఓవర్లలో 13.2 నుంచి 17.2 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా రాలేదు.
చివర్లో దినేష్ కార్తీక్ హిట్టింగ్
17వ ఓవర్ చివరి బంతికి అక్షర్ పటేల్ (10పరుగులు 11బంతుల్లో) ఔటయ్యాడు. ఇక క్రీజులో దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్ (12పరుగులు 9బంతుల్లో 2ఫోర్లు నాటౌట్) చివరి మూడు ఓవర్ల పాటు ఆడారు. వీరిద్దరూ చివర్లో కాస్త ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు కాస్త వేగాన్ని పుంజుకుంది. తొలుత 16బంతులకు 9పరుగులు మాత్రమే చేసిన దినేష్ కార్తీక్.. ఆ తర్వాత హిట్టింగ్ మొదలెట్టాడు. 19 ఓవర్ చివరి రెండు బంతులకు రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత 20ఓవర్ ప్రిటోరియస్ వేయగా తొలి బంతికి హర్షల్ పటేల్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి దినేష్ కార్తీక్‌కు సింగిల్ తీసిచ్చాడు. ఇక 4, 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ బాదిన దినేష్ కార్తీక్, చివరి బంతికి సింగిల్ తీశాడు. దీంతో చివరి ఓవర్లో 18పరుగులొచ్చాయి. తద్వారా భారత్ స్కోరు 148కి చేరుకుంది.
తుది జట్లు :
టీమిండియా ప్లేయింగ్ XI : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI : టెంబా బావుమా( కెప్టెన్ ), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నార్జ్