Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారీ సిక్సర్లు బాదుతున్న పంత్.. త్వరగా వచ్చెయ్ అంటున్న ఫ్యాన్స్!

గతేడాది ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైన యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు. ప్రమాదం తర్వాత ముంబైలోని కోకిలా బెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో పంత్‌కు పలు శస్త్రచికిత్సలు జరిగాయి. వీటి నుంచి కోలుకుంటన్న పంత్.. ఇటీవలే బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడని సమాచారం.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఇప్పుడప్పుడే కోలుకోవడం జరగదని అనిపించింది. కానీ పంత్ ఇలా వేగంగా బ్యాటింగ్ చేసే స్థాయికి చేరుకోవడం చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ఎన్సీయే వైద్యులు కూడా దీనిపై కీలక ప్రకటన చేశారు. పంత్ రికవరీ రేటు చాలా బాగుందని, అతను తాజాగా 150 కిలోమీటర్ల వేగంతో వస్తున్న బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడని తెలిపారు.

ishabh Pant

ఇప్పుడు తాజాగా రిషభ్ పంత్ ప్రాక్టీస్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిలో చూడచక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలర్ వేసిన బంతిని తనదైన స్టైల్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ ఆనందంతో మైమరిచిపోతున్నారు. ఈ వీడియోలో పాత పంత్ కనిపిస్తున్నాడని, త్వరలోనే అతను మళ్లీ జట్టులోకి వస్తే చూడాలని ఉందని అంటున్నారు.

ఇక ఈ వీడియోలో నిలబడి బ్యాటింగ్ చేస్తున్న పంత్.. పెద్దగా ఫుట్ వర్క్ లేకుండా తనకు ఎవరూ ఎదురు లేని విధంగా సిక్సర్ బాదాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ అందరూ పంత్ పట్టుదలను చూసి మురిసిపోతున్నారు. సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకురాపోయి ఉంటే ప్రాణాలు కోల్పోయేవాడన్న స్థితి నుంచి.. పంత్ ఇంత త్వరగా కోలుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా పంత్ వేగంగా కోలుకొని టీమిండియాలోకి వచ్చేస్తే జట్టులో అతని లేని లోటు తీరుతుంది. ముఖ్యంగా టెస్టు జట్టులో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతలా అంటే.. అతను ఉండి ఉంటే డబ్ల్యూటీసీ ఫైనల్ టీమిండియానే గెలిచేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Story first published: Thursday, August 17, 2023, 16:19 [IST]
Other articles published on Aug 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+