
కిషన్‌కు భారీ ధర
ఇషాన్ కిషన్ ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయే అవకాశం ఉందని అభిమానులతోపాటు క్రికెట్ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. ఇషాన్ కోసం ప్రాంచైంజీలు ఏకంగా 18 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఎడమ చేతి బ్యాటర్ అయినా ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. అలాంగ్ ఓపెనింగ్ బ్యాటర్ కూడా అయినా ఇషాన్ కిషన్ వయసు 23 సంవత్సరాలు మాత్రమే. అలాగే భవిష్యత్ కెప్టెన్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉండడం కలిసొచ్చే అంశం. దీంతో ఇషాన్‌పై వేలంలో ప్రాంచైంజీలు కోట్లు కుమ్మరియడం ఖాయం అని పలువురు అంచనా వేస్తున్నారు. ఒక వేళ అభిమానుల అంచనాలకు తగ్గట్టు వేలంలో ఇషాన్ కిషన్ 18 కోట్లకు పైగా రేటు పలికితే అది ఐపీఎల్ వేలంలో చరిత్ర అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఫ్రాంచైంజీ ఒక ఆటగాడి కోసం అంతగా వెచ్చించలేదు.

ఇషాన్ కిషన్ రికార్డులు
2016 నుంచి అంటే 6 సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడుతున్న ఇషాన్ కిషన్ గత సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో ఇప్పటివరకు 61 మ్యాచ్‌లు ఆడాడు. 28 సగటుతో 1452 పరుగులు చేశాడు. అందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 99 పరుగులు. అంతేకాకుండా ఇప్పటివరకు 74 సిక్స్‌లు, 121 ఫోర్లు బాదాడు. స్ట్రైక్‌రేట్ 136 గా ఉంది. ఇక ఇప్పుడిప్పుడే భారత జట్టులోకి వస్తున్న ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్లో 2 వన్డేలు, 5 టీ20 ఆడాడు.
వన్డేల్లో 60, టీ20ల్లో 113 పరుగులు చేశాడు.

ఫిబ్రవరిలో వేలం
కాగా ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 13, 14న జరగనుంది. బెంగళూరు వేదికగా ఈ వేలం నిర్వహించనున్నారు. ఇందుకోసం టీంలు తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను కూడా ఇప్పటికే బీసీసీఐకి సమర్పించాయి. ఇక కొత్త జట్లైనా అహ్మదాబాదాద్, లక్నోకు తమ రిటెన్షన్ ప్లేయర్లను ఎంచుకోవడానికి బీసీసీఐ ఈ నెల చివరి వరకు గడువు ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు లక్నో జట్టు కేఎల్ రాహుల్, స్టోయినిస్, రవి బిష్ణోయ్‌ను రిటైన్ చేసుకుంది.

కరోనా టెన్షన్
మరోవైపు ఐపీఎల్ 2022ను కరోనా టెన్షన్ పెడుతోంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో లీగ్ ఈ సారి ఇండియాలో జరగడం కష్టంగానే ఉంది. దీంతో ప్రత్యామ్నాయ వేదికలుగా బీసీసీఐ యూఏఈ, శ్రీలంక, దక్షిణాఫ్రికాలను పరిశీలిస్తోంది. అయితే దేనిపై కూడా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వేలం పూర్తైతే వేదికపై బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.