Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎవరు గ్రేట్‌: కోహ్లీ Vs స్మిత్, గణాంకాలు ఏమి చెబుతున్నాయి

Is Virat Kohli The Greatest? Not Yet, Say The Stats

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో దిగ్గజాలుగా వినిపిస్తున్న పేర్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్. అయితే ఈ నలుగురిలో కోహ్లీ, స్మిత్‌లు అత్యుత్తమ క్రికెటర్లుగా కీర్తింపబడుతున్నారు. అయితే వీరిద్దరూ ఎవరు బెస్ట్ అనే ప్రశ్న తాజాగా ఉత్పన్నం అయింది.

విరాట్ కోహ్లీకి అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు 'రన్ మెషిన్'. అంతేకాదు ఈ తరం డాన్‌ బ్రాడ్‌మన్‌ అని కూడా అంటుంటారు. పోలికలకు తగ్గట్టే ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాడు. రెండు డబుల్ సెంచరీలతో పాటు ఆరు సెంచరీలు నమోదు చేశాడు.

టెస్టుల్లో వెనుకబడిన కోహ్లీ
అయితే టెస్టుల్లో మాత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని స్టీవ్‌ స్మిత్‌తో పోలిస్తే కొన్ని గణాంకాల్లో కాస్త వెనకే ఉన్నాడు. ఇప్పటి వరకు 63 టెస్టులు ఆడిన కోహ్లీ 53.75 యావరేజితో 5,268 పరుగులు చేశాడు. సగటున 5.30 ఇన్నింగ్స్‌లకు ఒకసారి సెంచరీ నమోదు చేశాడు. రూట్‌, విలియమ్సన్‌తో పోలిస్తే హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు.

అదే స్మిత్ విషయానికి వస్తే ఇప్పటివరకు 59 టెస్టులు ఆడాడు. కోహ్లీ కన్నా ఏడు తక్కువ. 62.32 యావరేజితో 5,796 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 22 సెంచరీలు నమోదు చేశాడు. యావరేజిగా 4.91 ఇన్నింగ్స్‌లకు ఒకసారి సెంచరీని నమోదు చేశాడు. విదేశాల్లో ఆడిన టెస్టుల్లో కూడా స్మిత్ సెంచరీలు సాధించాడు. విదేశీ గడ్డపై 32 టెస్టులాడి 53.94 యావరేజితో పరుగులు చేయగా కోహ్లీ 31 టెస్టులాడి 45.13 యావరేజిని నమోదు చేశాడు.

వన్డే క్రికెట్‌లో కోహ్లీ బెస్ట్
స్మిత్ కంటే కోహ్లీ మెరుగైన గణాంకాలను కలిగి ఉన్నాడు. 202 వన్డేల్లో 55.74 యావరేజితో 9,030 పరుగులు చేశాడు. ఇక లక్ష్యచేధనలో 65.29 యావరేజితో అద్భుత ప్రదర్శన చేశాడు. అదే స్మిత్‌ 103 వన్డేలాడి 43.23 యావరేజితో 2,329 పరుగులు చేశాడు.

టీ20ల విషయానికి వస్తే
టీ20 క్రికెట్‌లోనూ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. మొత్తం 213 టీ20ల్లో 40.85 యావరేజితో 133.28 స్ట్రయిక్‌రేట్‌తో 7,068 పరుగులు చేశాడు. ఇక 136 మ్యాచ్‌లాడిన స్మిత్‌ మాత్రం 30.03 యావరేజితో 125.36 స్ట్రయిక్‌రేట్‌తో 3,124 పరుగులు మాత్రమే సాధించాడు. వచ్చే ఏడాది టీమిండియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల పర్యటనలకు వెళ్లనుంది.

ఈ పర్యటనల్లో గనుక కోహ్లీ విజృంభిస్తే మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో విరాట్ కోహ్లీ అగ్రస్ధానాన్ని అందుకుంటాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 22, 2017, 19:37 [IST]
Other articles published on Dec 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+