ముంబై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సోలోగా ఉండేందుకే ఇష్టపడుతున్నాడని ముంబై మిర్రర్ ఒక కథనంలో పేర్కొంది. ప్రేమపక్షులైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ విడిపోయారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ, ఈ విషయంపై అధికారకంగా ప్రకటించలేదు.
అయితే ఇటీవల బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ పుట్టినరోజు వేడుకలకు సందర్భంగా జరిగిన ఓ సన్నివేశం మాత్రం వీరిద్దరూ విడిపోయారని అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. ఈ పుట్టిన వేడుకలకు హాజరైన కోహ్లీ తన సన్నిహితులతో ఉత్సాహంగా కనిపించాడట.

ప్రేమ విఫలమైనందుకు దేవదాసులా బాధపడటానికి బదులు పార్టీలు, డ్యాన్సులతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడని సన్నిహితులు చెప్తున్నారు. ఈ పుట్టిన వేడుక ముంబైలోని ఓ నైట్ క్లబ్ జరిగింది. ఈ పార్టీకి హాజరైన కోహ్లీ త్సాహంగా అందరినీ పలుకరించడమే కాదు.. 'నేను ఒంటరిని.. చలో డ్యాన్స్ చేద్దాం' అంటూ స్టెప్పులు కూడా వేశాడని ముంబై మిర్రర్ పత్రిక తెలిపింది.
దీంతో పార్టీకి వచ్చిన వారంతా అనుష్కతో బ్రేకప్ అయిన వార్తలు వాస్తమేనని నిర్ధారించుకున్నారు. అంతేకాదు 'అనుష్క కంట్రోలింగ్ గర్ల్ ఫ్రెండ్ అని, ఎప్పుడూ ఆమె జపం చేయాల్సి వచ్చేదని' అతడి సన్నిహితులతో చెబుతుండగా విన్నామని పార్టీకి హాజరైన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ప్రేమికుల రోజున అనుష్కతో గడిపేందుకు విరాట్ కోహ్లీ శ్రీలంక టీట్వంటీ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటే, అనుష్క మాత్రం సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' షూటింగ్‌లో తీరిక లేకుండా గడుపుతోందని ముంబై మిర్రర్ ఓ కథనంలో ప్రచురించింది.