Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీకి ఇదే చివరి టీ20 ప్రపంచకప్?

 Is this Virat Kohlis last T20 World Cup?, Here is What his childhood coach Rajkumar Sharma says

ముంబై: ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ హవా నడుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా రసవత్తరంగా ఈ టోర్నమెంట్ ఆరంభమైంది. తొలి రోజే సంచలనాలు నమోదయ్యాయి. నమీబియా చేతిలో శ్రీలంక మట్టి దారుణ పరాజయాన్ని చవి చూసింది. రెండో మ్యాచ్‌లోనూ అవే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుభవం ఉన్న నెదర్లాండ్స్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి నెదర్లాండ్స్ చివరి బంతి వరకూ ఆడింది. 19.5 ఓవర్‌లో లక్ష్యాన్ని అందుకుంది.

చూడాల్సిన మ్యాచ్‌లే..

చూడాల్సిన మ్యాచ్‌లే..

ఇవ్వాళ మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. వెస్టిండీస్ జట్టు స్కాట్లాండ్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ ఈ ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. హోబర్ట్‌లోని ఓవల్ స్టేడియ దీనికి వేదిక. రెండో మ్యాచ్ ఐర్లాండ్-జింబాబ్వేల మధ్య ఉంటుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఇది షెడ్యూల్ అయింది. ఇవ్వాళ జరిగే ఈ రెండు మ్యాచ్‌లు కూడా అభిమానులను కట్టి పడేసేవే. రెండు మ్యాచ్‌లల్లోనూ భారీ స్కోర్లు నమోదు కావడానికి అవకాశాలు ఉన్నాయి.

 వామప్స్‌లో..

వామప్స్‌లో..

అదే సమయంలో- భారత్ కూడా ఇవ్వాళ అఫీషియల్ వామప్ మ్యాచ్‌ను ఆడబోతోంది. ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఆస్ట్రేలియాను ఎదుర్కొనబోతోంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈ మ్యాచ్ కూడా 9:30 గంటలకే ఆరంభమౌతుంది. ఇది వామప్ మ్యాచే అయినప్పటికీ- అధికారికం. ఈ టోర్నమెంట్‌లో భారత్ ప్రస్థానం ఎలా ఉండబోతోందనే విషయాన్ని తేల్చేయనుంది. రెండు వామప్స్‌ను ఆడాల్సి ఉంది రోహిత్ సేనకు. ఎల్లుండి న్యూజిలాండ్‌ను మరో మ్యాచ్ ఉంటుంది.

కోహ్లీ రిటైర్‌మెంట్..

కోహ్లీ రిటైర్‌మెంట్..

ఈ పరిస్థితుల్లో కొత్తగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టీమిండియా బ్యాటింగ్ బ్యాక్‌బోన్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ అవుతుందనేది దాని సారాంశం. 2026లో నిర్వహించబోయే ఈ మెగా ఈవెంట్ నాటికి అతను రిటైర్ అవుతాడని, అప్పటివరకు ఆడలేడనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీకి ఎలాంటి సమస్యలు కూడా లేనప్పటికీ- ఫామ్ ఆందోళనకు గురి చేయవచ్చని, అదే ఆయన రిటైర్మెంట్‌కు దారి తీస్తుందని అభిప్రాయపడుతున్నారు.

ఆ తరువాతే..

ఆ తరువాతే..

ఈ వార్తలపై విరాట్ కోహ్లీ చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మ స్పందించారు. వీటిని ఆయన కొట్టేశారు. ఇంకా సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడగలిగే శక్తి సామర్థ్యాలు కోహ్లీకి ఉన్నాయని స్పష్టం చేశారు. 2026లో జరగబోయే టోర్నమెంట్‌లోనూ అతను ఆడతాడనడంలో సందేహాలు అక్కర్లేదని వివరించారు. ఇప్పటికే కోహ్లీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడని, ఇబ్బందికర పరిస్థితులను అధిగమించాడని గుర్తు చేశారు. 2026 వరల్డ్ కప్ తరువాతే విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వొచ్చని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.

Story first published: Monday, October 17, 2022, 9:21 [IST]
Other articles published on Oct 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+