For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: గాయాలతో ఉన్న ఆ ముగ్గురు స్టార్లు.. వరల్డ్ కప్‌ ఆడించడం కరెక్టేనా?

వరల్డ్ కప్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.. గాయాలతో ఉన్న స్టార్ ప్లేయర్లు తిరిగి జట్టులోకి వస్తారా? లేదా? అని. వీరిలో ముఖ్యుడు జస్‌ప్రీత్ బుమ్రా. గతేడాది టీ20 వరల్డ్ కప్ తదితర కీలక టోర్నీల్లో కూడా బుమ్రా ఆడలేదు. అతను గతేడాది నుంచి వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వచ్చే నెలలో జరిగే ర్లాండ్ టూర్‌ నుంచి జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ జట్టుతో కలిసే అవకాశాలు ఉన్నాయి. అతనితోపాటు శ్రేయాస్ అయ్యర్ కూడా ఐర్లాండ్ టూర్ నుంచి ఆడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఒకవేళ వీళ్లిద్దరి పునరాగమనం ఆలస్యమైతే వరల్డ్ కప్ ఆడే జట్టులో వీళ్లకు అవకాశం కల్పించాలా? వద్దా? అని చర్చ జరుగుతోంది. దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా దర్శకత్వం స్పందించాడు.

Is this Okay to pick these three stars for ODI World Cup

ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ముగ్గురికీ ఆసియా కప్ చాలా కీలకం కానుందని చోప్రా చెప్పాడు. వీళ్లు కనుక ఆసియా కప్ ఆడకుంటే.. వరల్డ్ కప్‌కు ఎంపికయ్య అవకశాలు కేవలం 50 శాతమే అని చోప్రా చెప్పుకొచ్చాడు. వీళ్లు ముగ్గురూ ఆసియా కప్ ఆడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఈ అంశంపై మాట్లాడిన చోప్రా.. 'బుమ్రా, అయ్యర్ , రాహుల్ ముగ్గురూ చాలా కాలంగా క్రికెట్ ఆడలేదు. దీంతో వీళ్లను వరల్డ్ కప్‌లో తీసుకోవాలా? వద్దా? అని చర్చ జరుగుతోంది. అయితే వైట్ బాల్ క్రికెట్‌లో బుమ్రా నెంబర్ వన్ బౌలర్, అలాగే రిషభ్ పంత్ గైర్హాజరీలో వికెట్ కీపర్‌గా రాహుల్ సరైన ఆప్షన్. ఇక వన్డేల్లో సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్‌లలో ఒకరినే తీసుకోవాలంటే.. అయ్యర్‌కే ఓటేస్తాం' అని చోప్రా వివరించాడు.

అయితే ఇలా గాయాల నుంచి కోలుకున్న ప్లేయర్లను వరల్డ్ కప్‌కు ఎంపిక చేయడం కొంత కరెక్ట్ కాదని చోప్రా అంగీకరించాడు. అయితే ఈ టోర్నీ ముగిసేలోపు వీళ్లంతా తమ పూర్వపు ఫామ్ అందుకునే ఛాన్స్ ఉందని చోప్రా చెప్పాడు. 'ఒకవేళ ఈ ముగ్గురూ ఆసియా కప్ ఆడలేదంటే.. వారికి ఆసీస్ సిరీస్ ఒక్కటే అవకాశం. అప్పుడు వీళ్ల ఎంపిక 50-50 ఛాన్స్ అయిపోతుంది. పూర్తి సన్నద్ధంగా లేని ప్లేయర్లను తీసుకోకూడదు' అని చోప్రా స్పష్టం చేశాడు.

Story first published: Wednesday, July 19, 2023, 13:10 [IST]
Other articles published on Jul 19, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+