For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నడిరోడ్డుపై టవల్‌తో తిరుగుతున్న మాజీ కెప్టెన్: వైరల్ ఫొటో

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టు వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయి స్పందన వస్తోంది. కేవలం టవల్ కట్టుకుని రోడ్డు మీద నడుస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్ నజీర్ హుస్సేన్ ఫొటోను ట్వీట్ అది. దీంతో నజీర్ అభిమానులు, జోస్ బట్లర్ అభిమానులు ఎవరనే ప్రశ్న లేవనెత్తుతూనే.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అతనేనా.. అనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు. కొందరైతే క్రికెటర్ అనుకుని పొరబాటు పడుతున్నారు. అతను రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ అంటున్నారు.

ఇంతకీ అది ఇటీవల దిగిందో, లేక పాతదో తెలీదు గానీ ఇంగ్లాండ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉండటంతో ఇది కాస్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ పర్యటనలో ఐదు వన్డేలు, రెండు టెస్టులు జరగనున్నాయి. ఇందులో భాగంగా జరిగిన మొదటి వన్డేలో రోస్ టేలర్ సెంచరీతో చెలరేగాడు. హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్ జట్టుకు విజయం అందించాడు.

తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిసిన మ్యాచ్‌లో కేవలం నాలుగు బంతుల తేడాతోనే గెలుపోటములు నిర్దేశింపబడటం గమనార్హం. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తొలి వన్డే వివరాలిలా ఉన్నాయి.
రాస్‌ టేలర్‌ (113) సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ బోణీ కొట్టింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డేలో కివీస్‌ 3 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 284 పరుగులు చేసింది. రూట్‌ (71), బట్లర్‌ (79) రాణించారు. ఛేదనలో వోక్స్‌ (2/47), విల్లె (1/26) ధాటికి కివీస్‌ ఒక దశలో 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో టేలర్‌, లోథమ్‌ (79)తో కలిసి నాలుగో వికెట్‌కు 178 పరుగులు జత చేసి కివీస్‌ను విజయపథంలో నడిపించాడు. కెరీర్‌లో 18వ సెంచరీ చేసిన టేలర్‌ కూడా కీలక సమయంలో ఔట్‌ కావడంతో ఒక దశలో 244/7తో ఓటమి దిశగా నడిచింది.

కానీ చివర్లో ధాటిగా ఆడిన శాంట్నర్‌ (45), సౌథీ (8 నాటౌట్‌)తో కలిసి జట్టును గెలిపించాడు. నిషేధానికి గురైన తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (2/43) ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో మాత్రం అతను 12 పరుగులకే ఔటయ్యాడు.

Story first published: Monday, February 26, 2018, 17:04 [IST]
Other articles published on Feb 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+