Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023 : సచిన్ నువ్వా?.. డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కామెంటరీ విన్న ఫ్యాన్స్ అనుమానం?

Is that Sachin commentary in WPL 2023 goes viral

మహిళల ప్రీమియర్ లీగ్‌ ఆరంభ మ్యాచ్ అద్భుతంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా 140పైగా పరుగుల తేడాతో గుజరాత్ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 200పైగా స్ట్రైక్ రేటుగో ఆడిన ఆమె తన జట్టుకు భారీ స్కోరు అందించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఛేజింగ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది.

ఆ జట్టు ఛేజింగ్ 8వ ఓవర్లో గుజరాత్ కీలక ప్లేయర్ అమీలియా కెర్ బ్యాటింగ్ చేస్తోంది. ఆమెను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసినట్లు స్నేహ్ రాణా అప్పీల్ చేసింది. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో హర్మన్ రివ్యూ కోరింది. ఈ సమయంలో కామెంటరీ చెప్తున్న వ్యక్తి అచ్చం సచిన్ టెండూల్కర్‌లా మాట్లాడాడు. అతని కంఠం విన్న అభిమానులకు పిచ్చెక్కినట్లు అయింది.

మహిళల ప్రీమియర్ లీగ్‌ను బాగా ప్రమోట్ చేసేందుకు సచిన్‌ను కామెంటరీ కోసం తెచ్చారా ఏంటి? అని ఆశ్చర్యంగా అడిగారు. సదరు కామెంటేటర్ కంఠం కానీ, స్టైల్ కానీ అచ్చు గుద్దినట్లు మాస్టర్ బ్లాస్టర్‌లానే ఉండటంతో అభిమానులంతా బాగా సర్‌ప్రయిజ్‌ అయ్యారు.

నెట్టింట దీనిపై తమ ఆలోచనలు పెట్టిన హర్మన్‌ప్రీత్.. మ్యాచ్ గెలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. అంతా తాము అనుకున్నట్లే జరిగిందని, దీని వల్లనే తాము గెలవగలిగామని ఆమె స్పష్టం చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు కేవలం 64 పరుగులకే ఆలౌట్ అవడం గమనార్హం.

ఆ జట్టు టాపార్డర్‌లో నలుగురు ఆటగాళ్లు అందరూ కనీసం సింగిల్ డిజిట్ స్కోరు కూడా చెెయ్యాలేదు. దీంతో ఆ జట్టు ఏమాత్రం విజయానికి దూరమయ్యాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం సచిన్‌లా మాట్లాడిన కామెంటేటర్ చాలా పాపులర్ అవడం గమనార్హం.

Story first published: Sunday, March 5, 2023, 10:00 [IST]
Other articles published on Mar 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+