అశ్విన్ నీ చేతిలో ఉన్నది ఏంటీ?: నెటిజన్ల గందరగోళం

హైదరాబాద్: టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్‌లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు ఆ ఫొటోలో అశ్విన్ ఏం తింటున్నాడో అన్న దానిపై పెద్ద చర్చే జరిగింది. ఓ నెటిజన్ వడ అంటుంటే మరొక నెటిజన్ ఆపిల్ అంటున్నాడు.
ఇంతకీ అశ్విన్ ఏం తింటున్నాడో మీరే చూడండి. నాగ్ పూర్ వేదికగా రెండో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్ జట్టులోని సహచర ఆటగాడు విజయ్ శంకర్, బ్యాటింగ్ కోచ్ శ్రీధర్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ సందర్శనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అక్కడ దిగిన కొన్ని ఫోటోలను అశ్విన్ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఒక ఫొటోలో అశ్విన్ ఏదో తింటున్నాడు. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు అశ్విన్ ఏం తింటున్నాడో అర్థం కాలేదు. దీంతో 'అశ్విన్ నువ్వు తింటున్నది వడ లేక ఆపిలా' అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.
దీనిపై చివరకు స్పందించిన అశ్విన్ వడ కాదు ఆపిల్ అని సమాధానమిచ్చాడు. కాగా, నాగ్ పూర్ టెస్టులో అశ్విన్ టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్ల తీసి ప్రపంచ రికార్డుని సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక, టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 2న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications