For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ 2019: టూర్ మ్యాచ్‌లో విఫలం, 4వ టెస్టులో స్మిత్ ఆడతాడా?

Is Steven Smith fit for the 4th test of Ashes?

హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా నాలుగో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది. లార్డ్స్ టెస్టులో గాయపడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌ స్మిత్‌ నాలుగో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ విసిరిన బౌన్సర్‌‌ స్టీవ్ స్మిత్ మెడను బలంగా తాకింది.

మైదానంలో కుప్పకూలిన స్మిత్‌

మైదానంలో కుప్పకూలిన స్మిత్‌

దీంతో మైదానంలో స్మిత్‌ కుప్పకూలాడు. అనంతరం ఫిజియో రావడం.. అతడు తేరుకోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, గాయం కారణంగా లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టుకు స్మిత్‌ దూరమయ్యాడు. తాజాగా స్టీవ్‌ స్మిత్‌ గాయం నుంచి కోలుకుని డెర్బీషైర్‌తో జరిగిన టూర్‌ మ్యాచ్‌లో పాల్గొన‍్నాడు.

టూర్ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన స్మిత్

టూర్ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన స్మిత్

డెర్బీ షైర్‌తో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌ 23 పరుగులు చేశాడు. మూడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దీనిపై మిచెల్‌ మార్ష్‌ మాట్లాడుతూ స్మిత్‌ 20 పరుగులు కొట్టాడా.. 220 కొట్టాడా అనేది విషయం కాదు. అతనికి ప్రాక్టీస్‌ ఎంతవరకూ లభించిందనేది ముఖ్యం. స్మిత్‌ ఫిట్‌‌గా ఉన్నాడని చెప్పాడు.

నాలుగో టెస్టులో స్మిత్‌ ఆడటం ఖాయమే

నాలుగో టెస్టులో స్మిత్‌ ఆడటం ఖాయమే

దీంతో నాలుగో టెస్టులో స్మిత్‌ ఆడటం దాదాపు ఖాయమే. మూడో టెస్టులో స్టీవ్ స్మిత్‌ గైర్హాజరీతో ఆ మ్యాచ్‌ను ఆసీస్‌ కోల్పోయింది. దీంతో నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్‌ రాకతో మళ్లీ గాడిలో పడాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా... రెండో టెస్టు డ్రా ముగిసింది.

ఫిలిప్ హ్యూస్ విషాదం గుర్తుకొచ్చింది

ఫిలిప్ హ్యూస్ విషాదం గుర్తుకొచ్చింది

తనకు గాయమైన మరుక్షణం ఫిలిప్ హ్యూస్ విషాదం కళ్లముందు కదలాడిందని స్మిత్‌ తాజాగా చెప్పుకొచ్చాడు. 'బంతి తగలగానే నా మెదుడులో కొన్ని విషయాలు పరుగెత్తాయి. ముఖ్యంగా నాకు ఎక్కడ గాయం అయింది అని కంగారుపడ్డా. ఆ సమయంలో ఫిలిప్ హ్యూస్ విషాదం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో అందరికి తెలుసు. దీంతో కొంత ఆందోళనకు గురయ్యా' అని స్మిత్ తెలిపాడు.

Story first published: Saturday, August 31, 2019, 12:27 [IST]
Other articles published on Aug 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+