ఫోటో ఏం చెబుతోంది!: అజహర్ కొడుకుతో సానియా మిర్జా చెల్లెలు పెళ్లి!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా త్వరలో వివాహం చేసుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆనమ్ మిర్జా తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆనమ్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలో బ్లాక్ టాప్‌తో పాటు పింక్ కలర్ స్కర్ట్‌ను ధరించి ఉంది. అంతేకాదు పక్కనే బెలూన్లతో 'Bride-to be' రాసి ఉంది. మొత్తం రెండు ఫోటోలను పోస్టు చేసిన ఆనమ్ మిర్జా అందులో హార్ట్ సింబల్‌తో కామెంట్ చేయడం విశేషం. ఆమె పోస్టు చేసిన కొద్దిసేపటికే పద్నాలుగు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

నెటిజన్ల అభినందనలు
అంతేకాదు పలువురు అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఒక నెటిజన్ అయితే 'చాలా అందంగా ఉన్నావ్' అంటూ కామెంట్ పెట్టాడు. గత కొంత కాలంగా అసద్, ఆనమ్‌లు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన మాజీ భర్త అక్బర్ రషీద్ నుంచి గతేడాది ఆమె విడాకులు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

పెళ్లిగా మార్చుకునేందుకు
ఆనమ్‌కు కోర్టు నుంచి విడాకులు మంజూరు అనంతరం అసద్‌తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు ఈ మధ్యే వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రేమను పెళ్లిగా మార్చుకునేందుకు ఇద్దరూ సిద్ధమైనట్లు సమాచారం. మీడియా కథనాలు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత వ్యక్తుల సమాచారం ప్రకారం అసద్, ఆనమ్ ప్రేమలో ఉన్నారు.

ఈ ఏడాది ఆఖర్లో పెళ్లి
అయితే, వాళ్ల కుటుంబాలు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఏడాది ఆఖర్లో ఇద్దరూ పెళ్లిన చేసుకోనునట్లు తెలుస్తోంది. 25 ఏళ్ల ఆనమ్ మిర్జా 2016లో అక్బర్ రషీద్‌ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

అజహరుద్దీన్‌కు ఇద్దరు కుమారులు
అయితే, ఏమైందో తెలియదు గానీ రషీద్ నుంచి ఆమె విడాకులు కోసం తీసుకునేందుకు దరఖాస్తు చేసినట్లు గతేడాది వార్తలు వచ్చాయి. మరోవైపు మహ్మద్ అజహరుద్దీన్‌కు ఇద్దరు కుమారులు కాగా, ఒకరు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన బైక్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications