రోహిత్ శర్మ గాయపడ్డాడంటూ వార్తలు
ఇక ఇంగ్లాండ్‌కు బయల్దేరిన బ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ లేడు. అతను ఒక్క ఫోటోలు కూడా కన్పించలేదు. దీంతో అతని ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడని కొందరు, గాయపడ్డాడని మరికొందరు వార్తలు అల్లేశారు. అతను ఈ టెస్ట్‌కు అందుబాటులో ఉండట్లేదని, రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని కూడా వార్తలు రాసేశారు. అయితే అలాంటిదేం లేదని, రోహిత్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, 5వ టెస్ట్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడని విశ్వసనీయ సమాచారం అందింది. జూన్ 20న బెంగళూరు నుంచి దక్షిణాఫ్రికా సిరీస్లో ఆడుతున్న టెస్ట్ జట్టుకు ఎంపికైన ప్లేయర్లతో కలిసి అతను ఇంగ్లాండ్‌కు బయలుదేరతాడు. ఇటీవలే వెకేషన్‌కు వెళ్లొచ్చిన రోహిత్ కాస్త లేటుగా టీంతో జాయిన్ కానున్నాడు. ఇక యూకేకు బయల్దేరిన టెస్టు ఆటగాళ్ల బ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ ఆర్.అశ్విన్ కూడా కనిపించకపోవడం గమనార్హం. అశ్విన్ కూడా 20న యూకేకు బయలుదేరుతాడు.
ఐర్లాండ్‌తో హార్దిక్ జట్టు.. ఇంగ్లాండ్‌తో రోహిత్ జట్టు
ఇకపోతే జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీ20 జట్టు రెండు టీ20లు ఆడనుంది. అదే టైంలో జూన్ 24 నుండి 27 వరకు లీసెస్టర్‌షైర్‌తో భారత టెస్ట్ జట్టు 4-రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో లార్డ్స్, ఓవల్‌లో విజయం సాధించిన భారత్ 2-1ఆధిక్యంలోకి ఉంది. ఇక రోహిత్ ఈ సిరీస్లో 4టెస్టుల్లో 368పరుగులు చేసి మంచి ఫామ్ కనబరిచాడు. ఇక ఈ సిరీస్లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 564పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.
ఇంగ్లాండ్‌తో 5వ టెస్ట్‌కు ఎంపికైన టీమిండియా జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ , మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ కృష్ణ


Click it and Unblock the Notifications












