Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షర్ట్ తీసిన బాబర్.. స్పోర్ట్స్ బ్రా చూసి షాకైన ఫ్యాన్స్.. అసలు అదేంటంటే?

ఫ్యాన్స్‌కు క్రికెటర్లు అప్పుడప్పుడూ గిఫ్ట్‌లు ఇవ్వడం చూస్తూనే ఉంటాం. గతంలో డేవిడ్ వార్నర్ ఒకసారి తన గ్లవ్స్‌ను ప్రేక్షకుల్లో ఉన్న ఒక పిల్లాడికి గిఫ్ట్ ఇచ్చేశాడు. అలాగే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా తనను చూడటానికి వచ్చిన ఫ్యాన్‌కు ఏదో ఒకటి ఇవ్వాలని అనుకున్నాడు. తన జెర్సీ తీసేసి అది గిఫ్ట్‌గా ఇచ్చాడు. కానీ అతను అలా జెర్సీ తీయగానే అందరూ షాకయ్యారు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎందుకంటే.. సాధారణంగా క్రీడాకారులు జెర్సీ తీస్తే.. లోపల బనీయన్, లేదా ట్రాక్ సూట్ ఉంటుంది. కానీ బాబర్ ఒంటిపై స్పోర్ట్స్ బ్రా ఉన్నట్లు కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. బాబర్‌కు ఇదేం మాయరోగం అనుకున్నారు. కానీ ఇది స్పోర్ట్స్ బ్రా కాదని, అలా కనిపించే వెస్ట్ అని కొందరు వివరణ ఇస్తున్నారు.

Pakistan captain gifted his jersey to a fan

స్పోర్ట్స్‌లో ఇది చాలా కాలం క్రితమే ప్రవేశ పెట్టబడింది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని వాడుతున్నారనేది నిజం. దీన్ని కంప్రెషన్ వెస్ట్ అని పిలుస్తారు. వెన్నును నిటారుగా ఉంచేందుకు, వీపులోని కండరాలు ఫిట్‌గా ఉండేందుకు ఇది బాగా హెల్ప్ చేస్తుందట. అంతేకాదు చాలా తేలికగా ఉండే ఇది వేసుకుంటే.. కనీసం ధరించిన వ్యక్తికి కూడా గుర్తుండదట.

ఈ వెస్ట్‌లో ఉండే జీపీఎస్ ట్రాకర్ సాయంతో ఆటగాడి రన్నింగ్ స్పీడ్‌ని తెలుసుకోవచ్చు. అలాగే ఇందులో గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ కూడా ఉంటాయి. వీటి సాయంతో ఆటగాళ్ల కదలికలను త్రీడీలో కొలుస్తూ.. మైదానంలో వారిని ట్రాక్ చేసే వీలుంటుంది. వీటితోపాటు ఈ వెస్ట్‌లో హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉందిట. వీటన్నింటి సాయంతో సేకరించిన సమాచారాన్ని డేటా బేస్‌లో దాచుకోవచ్చు.

ఈ డేటాను అనలైజ్ చేయడం ద్వారా ప్లేయర్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయొచ్చు. టీమిండియా ఆటగాళ్లు కూడా కొన్నిసార్లు వీటిని ధరిస్తుంటారని సమాచారం. 2018లో భారత కండిషనింగ్ కోచ్‌గా ఉన్న శంకర్ బసు దీన్ని జట్టుకు పరిచయం చేశాడట. దీనిలో ఉండే జీపీఎస్ ట్రాకర్ ద్వారా మ్యాచ్‌లో ఆటగాడు ఎంత దూరం పరిగెత్తాడో చూడొచ్చు. ప్లేయర్ కనుక 2 వేల మీటర్లు పరిగెత్తితే.. అతనికి ఆ మరుసటి రోజు విశ్రాంతి ఇవ్వాలని బసు సిఫారసు చేశాడు.

Story first published: Saturday, July 29, 2023, 12:19 [IST]
Other articles published on Jul 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+