Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లేటు వయస్సులో ఘాటు ప్రేమ.. రవిశాస్త్రి డేటింగ్ నిజమేనా??

Ravi Shastri Bowled Over By Bollywood Actress Nimrat Kaur
Is Nimrat Kaur dating Indian cricket team coach Ravi Shastri?

సౌతాంప్టన్: ఇంత లేటు వయస్సులో ఎంత ఘాటు ప్రేమయో.. అన్నట్లుగా ఉంది టీమిండియా కోచ్ రవిశాస్త్రి గురించి వింటూంటే.. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో కనిపించే మోడల్ నిమ్రత్ కౌర్‌తో ప్రేమలో పడ్డాడని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే రెండు నెలలుగా ఇంగ్లాండ్‌లో ఉండడం.. వీరిద్దరి మధ్య ఉన్న రెండేళ్ల పరిచయాన్ని బయటపెడుతుంది అంటున్నారు విమర్శకులు.

ఒకవైపు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను టీమిండియా కోల్పోయి భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంటే, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి మాత్రం 'కొత్త ప్రేమాయణం' వార్తల్లో నిలిచాడు. ప్రముఖ నటి నిమ్రత్‌ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆమె కూడా ఇంగ్లాండ్‌లోనే ఉంది. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని తెలుస్తోంది.

ప్రింట్‌ మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన నిమ్రత్‌ కౌర్‌.. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యింది. అలాగే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. పలు అవార్డులు పొందిన 'లంచ్ బాక్స్' మూవీలో నటించిందామె. ఇప్పుడు రవిశాస్త్రితో డేటింగ్ వార్తలతో ఈమె పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం రవిశాస్త్రి వయసు 56 సంవత్సరాలు. నిమ్రత్ వయసు 36. ఒక ప‍్రమోషన్‌ కార‍్యక్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా చిగురించిందని సమాచారం.

గతంలోనే రవిశాస్త్రికి పెళ్లి అయ్యింది. సంతానం కూడా ఉంది. అయితే పదేళ్లుగా భార్య రితూకు రవిశాస్త్రి దూరంగా ఉంటున్నాడు. ఈ క‍్రమంలోనే కొన్నేళ్ల కిందట రవిశాస్త్రి విడాకుల వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్త ప్రేమాయణ రూమర్లు వినిపిస్తున్నాయి. 1980 ప్రాంతంలో బాలీవుడ్‌ నటి అమ్రితా సింగ్‌తో డేటింగ్‌ చేసిన రవిశాస్త్రిపై తాజాగా ప్రేమ, డేటింగ్‌ అంటూ వార్తల రావడం హాట్‌ టాపిక్‌గా తయారైంది.

Story first published: Monday, September 3, 2018, 14:55 [IST]
Other articles published on Sep 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+