Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బోల్ట్ కంటే వేగంగా ధోని పరిగెత్తుతాడు?: ఫ్యాన్‌కు జయవర్దనే ఛలోక్తి

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై శ్రీలంక మాజీ క్రికెటర్ ఛలోక్తి విసిరాడు. లండన్ వేదికగా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ అభిమానులను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

ఈ రేసులో ఉసేన్ బోల్ట్ మూడో స్ధానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఉసేన్ బోల్ట్‌కి మద్దతు తెలుపుతూ జయవర్దనె 'ఉసేన్ బోల్ట్‌ని గౌరవించండి' అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. దాదాపు దశాబ్దకాలంగా ఉసేన్ బోల్ట్ స్ప్రింట్ రారాజుగా వెలుగొంది తన ఆఖరి రేసులో రజతంతో వీడ్కోలు చెప్పేశాడు.

Is MSD Faster Than Bolt? Mahela Jayawardene Cures A Delusional MS Dhoni Fan

మహిళా జయవర్దనే ట్వీట్‌కి స్పందించిన ఓ క్రికెట్ అభిమాని 'బోల్ట్‌‌ కంటే వేగంగా పరిగెత్తే మహేంద్రసింగ్ ధోనీని కూడా గౌరవించండి' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన జయవర్దనె 'ధోనీ తన బైక్‌ మీదా?' అంటూ చలోక్తి విసిరాడు.

అంటే దీనర్ధం ఉసేన్ బోల్ట్ వేగాన్ని ధోనీ బైక్‌ మీద వెళ్తే కానీ.. అందుకోలేడని పరోక్షంగా జయవర్దనే వెల్లడించాడు. ఇక జయవర్దనే విషయానికి వస్తే శ్రీలంక ఆల్ టైమ్ గ్రేటెస్ట్ దిగ్గజాల్లో ఒకడు. పదివేలకు పైగా పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+