వివాదాస్పద ఘటనలో మాథ్యూ వేడ్ ఔటా కాదా? చట్టం ఏం చెబుతుంది? బట్లర్ ఎందుకు అప్పీలు చేయలేదు?

ఇంగ్లాండ్ వర్సెస్ ఆసీస్ మధ్య పెర్త్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 టైంలో ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ వేడ్ వివాదాస్పద రీతిలో తన ఔట్‌ను తప్పించుకోవడానికి ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్‌ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. 17వ ఓవర్‌లో మార్క్ వుడ్ బౌలింగ్ వేయగా.. వేడ్ హిట్ చేయగా బంతి గాల్లోకి లేచింది. అయితే వేడ్ బంతిని గమనించలేదు.
అతను సింగిల్ కోసం పిచ్ నుంచి బయటికొచ్చాడు. అయితే మార్క్ వుడ్ గాల్లోకి లేచిన బంతిని అందుకునేందుకు ముందుకు పరిగెత్తుకుంటూ రాగా.. వేడ్ చేత్తో అడ్డుకున్నాడు. దీంతో క్యాచ్ మిస్సయ్యింది. మార్క్ వుడ్‌తో సహా ఇంగ్లాండ్ ప్లేయర్లందరు షాకయ్యారు. వాళ్లు అంపైర్ల మొహం చూశారు. కానీ పెద్దగా అప్పీలు చేయలేదు. అంపైర్లు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను అప్పీలు గురించి అడగగా... తాము అప్పీలు చేయట్లేదని బట్లర్ పేర్కొన్నాడు. దీంతో అంపైర్లు వేడ్‌ను ఔట్‌గా ప్రకటించలేదు.
అందుకే అప్పీలు చేయలేదు
'అసలేం జరిగిందో నాకు కచ్చితంగా తెలియదు. నేను వికెట్ల వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాను. బంతిని మాత్రమే అబ్జర్వ్ చేశా. అయితే మార్క్ వుడ్‌ను వేడ్ కావాలనే అడ్డుకున్నాడా అనే విషయాన్ని మాత్రం నేను చెప్పలేను. అయితే అంపైర్లు నన్ను అప్పీల్ కోసం సంప్రదించారు. అయితే నేను మాత్రం వద్దన్నాను. మేము ఆస్ట్రేలియాలో ఇప్పుడు చాలా రోజుల పాటు ఉండాల్సొస్తుంది. తొలి మ్యాచ్‌లోనే ఎలాంటి వివాదాన్ని రాజేయాలనుకోలేదు. అందువల్ల మా పర్యటన కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. వేడ్ ఇంటెన్షన్‌గా చేశాడా లేకుండా పొరపాటున జరిగిందా అనేది వాళ్లకే తెలియాలి.' బట్లర్ మ్యాచ్ అనంతరం జరిగిన సమావేశంలో చెప్పాడు. అయితే బట్లర్ అప్పీలు కోరుకుంటే ఇంతకీ వేడ్ అవుట్ అయ్యే వాడా కాదా అనే విషయంలో ఇప్పటికీ ప్రేక్షకుల్లో డౌట్ ఉంది.
ఎంసీసీ చట్టం ఏం చెబుతుందంటే..
క్రికెట్లోని ఎంసీసీ చట్టం 37.3ప్రకారం.. 'డెలివరీ నోబాల్ గనుక కానట్టయితే ఫీల్డింగ్‌కు ఉద్దేశపూర్వకంగా బ్యాటర్ ఏ కారణం చేతనైనా ఆటంకం కలిగిస్తే.. బ్యాటర్‌ను ఔట్‌గా పరిగణించాలి.' ఈ ఎంసీసీ క్లాజ్ ప్రకారం.. ఇంగ్లాండ్ గనుక అప్పీల్ చేసి ఉంటే వేడ్ ఔటయ్యేవాడు. ఇక స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గురించి ఇంగ్లాండ్ మొన్న దీప్తి శర్మ విషయంలో ఎన్నో మాటలు మాట్లాడింది. ఇప్పుడు తాజాగా వేడ్ చేసిన పని ఏమాత్రం స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కాదు. మరీ ఇప్పటికీ ఇంగ్లాండ్ మాజీలు కానీ, ప్రస్తుత ప్లేయర్లు కానీ నోరు మెదపడం లేదు.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠ
ఇకపోతే ఈ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ ద్వారా పునరాగమనం చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (68పరుగులు 32బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లు) తన మాస్ ఇన్నింగ్స్‌తో అలరించగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ (84పరుగులు 51బంతుల్లో 12ఫోర్లు, 3సిక్సర్లు) వీరవిహారం చేశాడు. దీంతో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 208పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఛేదనలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (54 బంతుల్లో 73 పరుగులు 8ఫోర్లు, 2సిక్సర్లు) గట్టి ప్రతిఘటన కనబర్చినప్పటికీ మిగతా వాళ్లలో ఒకరిద్దరి నుంచి భారీ ఇన్నింగ్స్ మిస్సయింది. అయినప్పటికీ చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో 16పరుగులు కావాల్సిన తరుణంలో వేడ్ తొలిబంతికి ఫోర్ బాదినప్పటికీ.. 3వ బంతికి ఔటవ్వడంతో ఆసీస్ విజయానికి 8పరుగుల దూరంలో ఆగిపోయింది. హేల్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications