న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌన్సర్లకు 20 మంది బలి: క్రికెట్‌లో జోఫ్రా ఆర్చర్ అత్యంత ప్రమాదకరమైన బౌలరా?

Is Jofra Archer the most dangerous bowler in cricket? He has now hit 20 batsmen

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు ఇప్పుటి వరకు ఆడింది 14 వన్డేలు, ఒక టెస్టు, ఒక టీ20. ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. అతడే జోఫ్రా ఆర్చర్. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు.

లార్డ్స్ టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తాకడంతో స్మిత్ మైదానంలో కుప్పకూలాడు. ఆసీస్ జట్టు ఫిజియో ప్రాథమిక చికిత్స అనంతరం స్టీవ్ స్మిత్ మెల్లగా రావడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్మిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

పీసీబీకి క్షమాపణలు చెప్పిన స్పాట్‌ ఫిక్సింగ్‌ క్రికెటర్‌

ఆ తర్వాత నొప్పి కారణంగా రెండో టెస్టు నుంచి స్టీవ్ స్మిత్ తప్పుకోవడంతో అతడి స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ కింద మార్నస్‌ లాబుస్చాగ్నే బరిలోకి దిగాడు. అయితే, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వెంటనే జోప్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతడు ఎదుర్కొన్న రెండో బంతికే గాయపడ్డాడు.

ఈ క్రమంలో జోఫ్రా ఆర్చర్ బౌన్సర్లకు గాయపడిన 20వ బాధిత క్రికెటర్‌గా మార్నస్‌ లాబుస్చాగ్నే నిలిచాడు. తన అరంగేట్ర టెస్టులో ఐదు వికెట్లు తీసి ఆర్చర్ అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లచే కొనియాడబడుతున్నాడు. ఈ క్రమంలో ఆర్చర్‌ మోస్ట్ డేంజరస్ బౌలర్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బార్బడోస్‌లో జన్మించి ప్రస్తుతం ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న జోఫ్రా ఆర్చర్ ఇప్పటికే 20 మంది బ్యాట్స్‌మన్ యొక్క తల లేదా శరీరాన్ని తన బౌన్సర్లతో తాకించాడు. ఇటీవలే ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సఫారీ బ్యాట్స్‌మన్‌ను తన బౌన్సర్లతో బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ఆర్చబ్ బౌన్సర్‌కు సఫారీ ఓపెనర్ హషీం ఆమ్లా మైదానంలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక, వన్డే వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో జోఫ్రా ఆర్చర్ బౌన్సర్లను భారత క్రికెట్ అభిమానులకు పరిచయం చేశాడు. ఆర్చర్ బౌన్సర్‌కు చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్ ధోని హెల్మెట్‌ ఎగిరి కిందపడిందో మనం చూశాం.

నిజానికి ఆర్చర్ లైన్ అండ్ లెంత్ బౌలింగ్ వేస్తాడు. ఇక, తన బౌలింగ్‌లో పరుగులు రాబడుతుంటే షార్ట్ పిచ్ బంతులు వేసి బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచుతాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడు బౌన్సర్లు కూడా సంధిస్తాడు. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌ను తొలిసారి విశ్వ విజేతగా నిలపడంలో జోఫ్రా ఆర్చర్ కూడా కీలకపాత్ర పోషించాడు.

'డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని ఆర్చర్ బౌలింగ్‌ చూడటం చాలా భయంగా ఉంటుంది'

వరల్డ్‌కప్ ఆరంభానికి ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంగ్లాండ్ గెలుపులో ఆర్చర్ కీలకపాత్ర పోషిస్తాడని అంచనా వేశాడు. కోహ్లీ చెప్పినట్లే లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసిన తీరు నిజంగా అద్భుతం.

తన తొలి టెస్టులో సైతం అద్భుత ప్రదర్శన చేశాడు. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్ మొత్తం 44 ఓవర్లు వేసి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో హెడింగ్లే వేదకగా గురువారం నుంచి ఆరంభమయ్యే మూడో టెస్టులో అందరి కళ్లు జోఫ్రా ఆర్చర్‌పైనే. అందుకు కారణం లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ గెలవాల్సి ఉన్నా... చివరకు డ్రాగా ముగిసింది.

జోఫ్రా ఆర్చర్ గురించి మ్యాచ్ అనంతరం మార్నస్‌ లాబుస్చాగ్నే మాట్లాడుతూ "ఆర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ గాయపడినప్పుడు కాస్త కంగారు పడ్డా. అలాంటి సమయంలో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆటలో భాగమై మైదానంలో అడుగుపెట్టాక శరీరంలో ఒకరకమైన ఆందోళన మొదలైనప్పుడు ఆ బంతిని చూడటమే తప్ప చేసేదేమీ ఉండదు" అని అన్నాడు.

"ఆర్చర్‌ వేసిన రెండో బంతి నా హెల్మెట్‌కు బలంగా తాకింది. అనంతరం కుదురుకొని ఏమీ కానట్టు ఆటను కొనసాగించాలి. మొదటి బంతుల్లోనే ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొనడం వల్ల ఉపయోగమదే. అలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేందుకు మేమంతా ముందే సిద్ధపడ్డాం. ఆర్చర్‌ కొన్నిసార్లు చాలా మంచి బౌలింగ్‌ చేశాడు. తన పదునైన బౌలింగ్‌తో మా బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాడు" అని మార్నస్‌ లాబుస్చాగ్నే అన్నాడు.

Story first published: Tuesday, August 20, 2019, 14:39 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X