యార్కర్ కింగ్ ఎక్కడ?: పాత పేరుతో ఎన్నాళ్లు నెట్టుకొస్తావు?
ఐపీఎల్ 2026 సీజన్లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన అస్త్రం, ప్రపంచ స్థాయి పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశంగా మారాయి. జస్ప్రీత్ బుమ్రా తన మునపటి వేగాన్ని, ఖచ్చితత్వాన్ని కోల్పోయాడని అంబటి రాయుడు కుండబద్ధలు కొట్టారు.
130 కిలోమీటర్ల వేగమా?.. రాయుడు శాకింగ్ కామెంట్స్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమి అనంతరం అంబటి రాయుడు మాట్లాడుతూ.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పదును తగ్గిందని అభిప్రాయపడ్డాడు. సాధారణంగా 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరే జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం కేవలం 130 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేస్తున్నాడని.. ఇది బ్యాటర్లకు సానుకూలంగా మారుతోందని అంబటి రాయుడు పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రా తన యార్కర్లను కూడా సరైన లెంగ్త్‌లో వేయలేకపోతున్నాడని, కేవలం తన పాత పేరుతోనే నెట్టుకొస్తున్నాడని రాయుడు ఘాటుగా విమర్శించాడు.

రెండు మ్యాచ్‌లు.. సున్నా వికెట్లు
గణాంకాలను పరిశీలిస్తే జస్ప్రీత్ బుమ్రా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ.. వికెట్లు తీయడంలో మాత్రం విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో జస్ప్రీత్ బుమ్రా వికెట్ లేకుండా ఇన్నింగ్స్ ముగించడం ముంబై జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది.
డెత్ ఓవర్లలో బుమ్రా ఒంటరి పోరాటం
జస్ప్రీత్ బుమ్రాకు డెత్ ఓవర్లలో సరైన సహకారం అందకపోవడం కూడా ముంబైని దెబ్బతీస్తోంది. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో జస్ప్రీత్ బుమ్రాపై ఒత్తిడి పెరుగుతోంది. డెత్ ఓవరల్లో బుమ్రా స్లో బాల్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నా.. వేగం తగ్గడం వల్ల బ్యాటర్లు సులభంగా ఎదుర్కొంటున్నారని అంబటి రాయుడు విశ్లేషించాడు. ముంబై ఇండియన్స్ డెత్ ఓవర్ల బౌలింగ్‌లో భారీ మార్పులు చేయకపోతే ఈ సీజన్లో ముందుకు సాగడం కష్టమని రాయుడు హెచ్చరించాడు.
సూర్యకుమార్ యాదవ్ సమర్థించినా..
మరోవైపు ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన బౌలర్లను వెనకేసుకొచ్చాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ విభాగం విఫలమైందని.. తాము అనుకున్న దానికంటే 15-20 పరుగులు తక్కువ చేశామని సూర్య పేర్కొన్నాడు. ముంబై నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 18.1 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తదుపరి మ్యాచ్‌లలోనైనా జస్ప్రీత్ బుమ్రా తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తాడా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications