అనుపమా బర్త్‌డే.. బుమ్రా ట్వీట్.. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్?

హైదరాబాద్ : న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన ఆటతోనే కాకుండా ఎఫైర్ వార్తలతో సోషల్ మీడియాను కుదిపేస్తున్నాడు. దక్షిణాది సినీ తార అనుపమ పరమేశ్వరన్‌తో ఈ యార్కర్ల కింగ్ డేటింగ్ చేస్తున్నట్టు గతంలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్విటర్ వేదికగా వీరు చేసిన ట్వీట్లు మళ్లీ ఈ వార్తలను ట్రెండింగ్‌లోకి తెచ్చాయి. మీదికి ప్రేమ లేదు.. దోమ లేదంటూ ఖండిస్తున్నా సీక్రెట్‌గా వీరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ ఉన్నట్లు మాత్రం వారి ట్వీట్లను చూస్తే అర్థమవుతోంది.

ఇంతకేం జరిగిందంటే..

మొన్న(ఫిబ్రవరి 18) ఈ సౌత్ బ్యూటీ బర్త్‌డే. దీంతో అనుపమ ట్విట్టర్ వేదికగా 'నాకు 24 ఏళ్ళు వచ్చేశాయి' అంటూ ఓ ఫొటోకు 24 అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది.

దానికి నెటిజన్లు కూడా ఈ కేరళ బ్యూటీకి విషెస్ తెలియజేశారు. కానీ ఇక్కడే బుమ్రా చేసిన పని అందరిని ఆకర్షించింది. మరోసారి వీరిద్దరి మధ్య ప్రేమ గురించి వార్తలు తెరపైకి వచ్చేలా చేసింది. ఇంతకీ బుమ్రా ఎం చేశాడంటే.. ట్విట్టర్ వేదికగా ప్లే స్టేషన్‌లో గేమ్ ఆడుతున్న ఫొటోకు ''డోంట్ గ్రో అప్.. ఇట్స్ ఏ ట్రాప్'' అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశాడు.

అతనేం సెహ్వాగ్, వార్నర్ కాదు.. కానీ అతనికో లెక్కుంది: గంభీర్

అమ్మా అర్థమైందిలే..

అనుపమ ట్వీట్ చేసిన 50 నిమిషాలకే బుమ్రా ఇలా ట్వీట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఎదో ఉందనే భావన నెటిజన్లకు కలిగింది. వెంటనే ఈ ఇద్దరిని ట్విటర్ వేదికగా ఓ ఆట ఆడుకున్నారు. ‘బుమ్రా.. నువ్వు ఈ ట్వీట్ ఎందుకు చేశావో తెలుసులే..' అని కొందరు అంటే.. ‘సమ్‌థింగ్ ఫిషీ.. వాట్స్ గోయింగ్ ఆన్'అని ఇంకొందరూ.. నీకెందుకయ్యా.. మా అను పాప ఎదుగుతే అంటూ మరికొందరూ కామెంట్ చేశారు. దీంతో ఈ ట్విట్లు నెట్టింట హల్‌చల్ చేశాయి.

నో డేటింగ్.. జస్ట్ ఫ్రెండ్

నో డేటింగ్.. జస్ట్ ఫ్రెండ్

ఈ ప్రేమ వ్యవహారంపై గతంలో అనుపమను మీడియా వివరణ కోరగా.. ఇవన్నీ గాలి వార్తలనీ కొట్టిపారేసింది. అతను తనకు స్నేహితుడు మాత్రమేనని, డేటింగ్ చేయడం లేదని వివరణ ఇచ్చింది. ‘క్రికెటర్ బూమ్రాతో పరిచయం ఉంది. అతను నాకు మంచి ఫ్రెండ్. అంతేగానీ మీడియాలో వచ్చినట్టు డేటింగ్ చేయడం లేదు. సోషల్ మీడియాలో ఇలాంటి ఊహగానాలకు తెరదించాలి.' అని అనుపమ విజ్ఞప్తి చేసింది.

ఫామ్‌లోకి బుమ్రా..

ఫామ్‌లోకి బుమ్రా..

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో దారుణంగా విఫలమైన బుమ్రా.. శుక్రవారం ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్ ఎలెవెన్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా.. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను స్వింగర్‌తో తీసిన ఓ వికెట్ సోషల్ మీడియాలో వైరలయ్యింది. మూడు వన్డేల్లో ఒక్క వికెట్ తీయని బుమ్రా.. టెస్ట్ సిరస్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, February 20, 2020, 17:35 [IST]
Other articles published on Feb 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X