Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ముగ్గురినీ లేపేసే టైమొచ్చింది.. !!

ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి విజయం తర్వాత ముంబై ఇండియన్స్ గెలుపు ట్రాక్ తప్పింది. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం పంజాబ్ కింగ్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది వారికి వరుసగా నాలుగో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (60 బంతుల్లో 112 పరుగులు నాటౌట్) అద్భుత శతకం సాధించినా, జట్టు విజయం సాధించలేకపోయింది.

పంజాబ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 22 పరుగులకి మూడు వికెట్లు తీయగా, శశాంక్ సింగ్ ఒక వికెట్ పడగొట్టారు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై బౌలర్ అల్లా గజన్‌ఫర్ రెండు వికెట్లు తీసినా అది జట్టుకు విజయానికి సరిపోలేదు. పంజాబ్ విజయంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (39 బంతుల్లో 80 పరుగులు నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 66 పరుగులు) కీలక పాత్ర పోషించారు. మూడో వికెట్ కోసం 67 బంతుల్లో 139 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Is it time to drop Suryakumar Yadav Tilak Varma Jasprit Bumrah in India T20 for Patidar and Shreyas

ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా సమస్యగా మారాడు. గత ఐదు మ్యాచ్‌లలో పేలవ ప్రదర్శన చేశాడు. ఇది అతనొక్కడితోనే పరిమితం కావట్లేదు. కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాప్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మలు సైతం వరుసగా విఫలమౌతోన్నారు. దీంతో వారిని పక్కన పెట్టాలనే వాదనలు బలంగా వినిపిస్తోన్నాయి. టీమిండియా టీ20 కేప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్ ను తప్పించాలని కోరుతున్నారు. తిలక్ వర్మ, బుమ్రాలపైనా వేటు వేయాలని సూచిస్తోన్నారు. వారి స్థానంలో రజత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్ ను తీసుకోవాలనే అభిప్రాయపడుతున్నారు.

సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. ఇది జట్టుకు పెద్ద సమస్యగా మారింది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 19 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ, అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. బుమ్రా వికెట్లు పడగొట్టకపోవడం ముంబై ఇండియన్స్‌కు భారీ నష్టం కలిగిస్తోంది.

సూర్యకుమార్, బుమ్రాతో పాటు తిలక్ వర్మ కూడా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. టీ20లలో బాగా ఆడినా, ఐపీఎల్ 2026లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌లలో కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో ఓటమి అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా, జట్టు ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశాడు. దీని ప్రకారం చూస్తే బుమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లలో ఒకరిద్దరిపై వేటు పడే అవకాశం ఉంది.

Story first published: Friday, April 17, 2026, 10:46 [IST]
Other articles published on Apr 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+