For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohith Sharma: సమయం లేదు రోహిత్ శర్మ.. ఆడటమా లేక రిటైర్మెంట్ ప్రకటించడమా..!

టెస్టుల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్లాప్ షో కొనసాగుతోంది. తాజాగా మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో కూడా రోహిత్ విఫలమయ్యాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్ పెవిలియన్ చేరాడు. అనవసర షాట్ కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో రోహిత్ ఆటపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ఆట అంటూ నిలదీస్తున్నారు. రోహిత గత కొంత కాలంగా టెస్టుల్లో పేలవంగా ఆడుతున్నాడు. అయినప్పటికీ కెప్టెన్ కాబట్టి జట్టులో కొనసాగుతున్నాడు.

ఇంకా ఎన్ని రోజులు అతన్ని కొనసాగిస్తారు.. తప్పించడని డిమాండ్లు పెరుగుతోన్నాయి. బోర్డు గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ రెండో టెస్ట్ నుంచి అందుబాటులోకి వచ్చాడు. రోహిత్ రెండు టెస్ట్ ల్లో అంతగా ఆకట్టుకోలేదు. మూడో టెస్ట్ లో కూడా అదే నిర్లక్ష్యం ప్రదర్శించాడు. అతను ఈ సిరీస్ లో 4 ఇన్నింగ్స్ ల్లో 3, 6, 10, 3 పరుగులే చేశాడు. గత సిరీస్ ల్లో కూడా అంతగా ఆడలేదు. రోహిత్ శర్మ చివరి 14 ఇన్నింగ్స్‌లలో- 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3 పరుగులు చేశాడు.

Is it time for Indian captain Rohit Sharma to announce his retirement

14 ఇన్నింగ్స్ ల్లో 11.07 సగటుతో కేవలం 155 పరుగులే చేశాడు. 37 ఏళ్ల వయసున్న రోహిత్ ఆడడం, పరుగెత్తడంలో ఇబ్బంది పడుతున్నాడని మాజీలు విమర్శిస్తున్నారు. రోహిత్ రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ఐదో టెస్ట్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సిడ్నీలో జనవరి 3 నుంచి ఆసీస్‌తో ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా ప్రచారం కొనసాగుతోంది.

రోహిత్ కెప్టెన్సీలో పేలవంగా ఉన్నాడని.. బుమ్రా నాయకత్వంలో భారత జట్టు పూర్తిగా భిన్నంగా కనిపించిందని మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైకేల్ వాన్ అన్నారు. మెల్ బోర్న్ టెస్ట్ లో రెండో రోజు ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. యశ్వస్వి జైస్వాల్ 82 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 36, కేఎల్ రాహుల్ 24 పరుగులు చేశారు. ప్రస్తుతం రిషబ్ పంత్, జడేజా క్రీజ్ లో ఉన్నారు. ఇండియా 310 పరుగుల వెనకంజలో ఉంది. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్, బోలాండ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Story first published: Friday, December 27, 2024, 16:00 [IST]
Other articles published on Dec 27, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+