INDvsSL: టీ20ల నుంచి కోహ్లీని తప్పించడం కరెక్టేనా?.. అలా చేసుంటే బాగుండేదేమో?

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ నెమ్మదిగా పొట్టి క్రికెట్‌కు దూరం అవుతున్నాడు. వేగంగా ఆడటం లేదనే కారణంతోనే అతన్ని పక్కన పెడుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది శ్రీలంకతో ఆడే తొలి టీ20 సిరీస్‌కు కూడా అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే పొట్టి ఫార్మాట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీని ఇలా పక్కన పెట్టడం కరెక్టేనా? అనే ప్రశ్న అభిమానుల నుంచి ఎదురవుతోంది. ఈ లెక్కన చూస్తే కోహ్లీని ఎంపిక చేయకపోవడం తప్పే.

టీ20ల్లో భీకరమైన ఫామ్
ఈ ఏడాది ఆసియా కప్ ముందు నెలరోజుల పాటు పూర్తిగా క్రికెట్‌కు దూరంగా ఉండిపోయిన విరాట్ కోహ్లీ.. పునరాగమనంలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తిరిగి క్రికెట్ మైదానంలో అడుగు పెట్టినప్పుడు అతని ఆడింది టీ20 ఫార్మాట్లోనే. ఆసియా కప్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో అతను ఏ స్థాయిలో రాణించాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్తాన్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్ చాలా మందికి లైఫ్ టైం ఫేవరెట్‌గా నిలిచిపోతుంది. అలాంటి ఫామ్‌లో ఉన్న కోహ్లీని టీ20 సిరీసులకు పక్కన పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు కదా.

టీంలోని లీడర్లలో ఒకడు
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికాడు. అయినా కూడా జట్టులోని లీడర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ యువ ఆటగాళ్లు తమకు ఏదైనా సలహా కావాలంటే కోహ్లీని అడుగుతారు. అలాగే ఆటగాళ్లు నిరాశలో ఉన్నప్పుడు వాళ్లను చీర్ చేసే గుణం కూడా కోహ్లీకి ఉంది. భవిష్యత్తు కోసం యువ జట్టును తయారు చేసే సమయంలో కోహ్లీ వంటి లీడర్‌ను జట్టులో ఉంచడం వల్ల మేలే కానీ నష్టం ఏమీ జరగదు. పొట్టి ఫార్మాట్ కెప్టెన్ హార్దిక్‌కు సలహాలు కావాలన్నా ఇవ్వగల క్రికెటింగ్ బుర్ర కోహ్లీ దగ్గర ఉంది. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడే ధైర్యం కూడా అతని నుంచి కుర్రాళ్లు నేర్చుకోగలుగుతారు.

జట్టుకు మూలస్తంభం
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా టీ20 క్రికెట్ అంటే తొలి బంతి నుంచే ఎదురు దాడికి దిగడం అనే విధంగా సాగుతోంది. అయితే అన్నిసార్లూ అది సాధ్యం కాకపోవచ్చు. ఒక్కోసారి పూర్తి 20 ఓవర్లు క్రీజులో నిలబడటమే విజయాన్ని నిర్ధారిస్తుంది. అలాంటి ఆట ఆడాలంటే టీమిండియాలో కోహ్లీని మించిన వాళ్లు మరొకరు లేరు. అవతలి వైపు కుర్రాళ్లు చెలరేగుతుంటే తను యాంకర్ రోల్ పోషించడంలో కోహ్లీ నేర్పరి. అదే సమయంలో క్రీజులో కుదురుకున్న తర్వాత కోహ్లీ ఏ రేంజ్‌లో చెలరేగుతాడో టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ చూస్తే తెలుస్తుంది. ఎలాంటి బంతినైనా బౌండరీ దాటించగల టెక్నిక్ కోహ్లీ వద్ద ఉంది. కుర్రాళ్ల మధ్యలో కోహ్లీ వంటి ఆటగాడు ఉంటే వాళ్లు కూడా స్వేచ్ఛగా ఆడగలుగుతారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications