For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గుర్తుకొస్తున్నాయి: నాటి సీన్ రిపీట్?: చెన్నై సూపర్ కింగ్స్ డెత్ గేమ్

Is IPL 2020 happening again for CSK after suffering their third successive defeat in this season

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ పరాజయాలకు బ్రేక్ పడట్లేదు. మూడు మ్యాచ్‌లను ఆడినా ఇంకా బోణీ కొట్టనే లేదు. ఇక మీదట బోణీ కొడుతుందన్న ఆశ కూడా లేదు. ఈ సీజన్‌లో ముచ్చటగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ.. ఆ స్థాయి ఆటతీరును ప్రదర్శించట్లేదు. తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఇప్పుడు తాజాగా పంజాబ్ కింగ్స్ చేతుల్లో పరాభవాన్ని చవి చూసింది.

 గతాన్ని గుర్తు చేస్తోందిగా..

గతాన్ని గుర్తు చేస్తోందిగా..

చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి చూస్తోంటే 2020 సీజన్ రిపీట్ అయ్యేలా ఉంది. మరోసారి ప్లే ఆఫ్స్ వరకు వెళ్లకుండా వెనక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈ వెటరన్స్ జట్టు ఆటతీరు చూస్తోంటే దానికే ఫిక్స్ అయిపోవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా జరిగిన ఆ సీజన్‌లో చెన్నై- ప్లే ఆఫ్ ముఖం చూడకుండానే వెనక్కి వచ్చిన విషయం తెలిసిందే. 14 మ్యాచ్‌లల్లో గెలిచింది ఆరు మాత్రమే. మొత్తం 12 పాయింట్లతో టేటుల్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడటం..

తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడటం..

ఇప్పుడూ అదే జరుగుతోంది. మూడు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారిందీ టీమ్. బౌలింగ్ బాగుంటే..బ్యాటర్లు- బ్యాటర్లు రాణించిన మ్యాచ్‌లో బౌలర్లు విఫలం కావడం అప్పట్లో కనిపించింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మూడు మ్యాచ్‌లను ఓడిపోవడం ఇదే తొలిసారి. గతంలో ఇలాంటి సందర్భం ఎప్పుడూ ఎదురు కాలేదు. తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. ఆ తరువాత పుంజుకోవడం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకిన రోజులు ఉన్నాయి.

అచ్చొచ్చిన ముంబై గ్రౌండ్‌పైనా..

అచ్చొచ్చిన ముంబై గ్రౌండ్‌పైనా..

ఇప్పడు దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది. స్వదేశంలో.. పైగా అపారమైన క్రికెట్ ఆడిన ముంబై స్టేడియాల్లో నిర్వహిస్తోన్న మ్యాచ్‌లల్లో చెన్నై ఆటగాళ్లు చేతులెత్తేయడం అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇంత పేలవమైన ఫామ్‌ నుంచి ఎప్పుడు బయటపడుతుందోననే ఆందోళన నెలకొంది. ఇక ముందు ఆడబోయే ప్రతీమ్యాచ్‌ను కూడా గెలిస్తే గానీ.. బౌన్స్ బ్యాక్ కాలేకపోవచ్చు. టైటిల్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్‌నూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుంది.

నెక్స్ట్ మ్యాచ్ పరిస్థితేంటీ...

నెక్స్ట్ మ్యాచ్ పరిస్థితేంటీ...

చెన్నై సూపర్ కింగ్స్ తన తరువాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఈ నెల 9వ తేదీన నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో షెడ్యూల్ అయింది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభమౌతుంది. చెన్నైకి ఈ మ్యాచ్ లైఫ్ అండ్ డెత్‌గా పరిగణించవచ్చు. సన్‌రైజర్స్‌పపైనా ఓడిందంటే ఇక టైటిల్ రేసు నుంచి అవుట్ అయినట్టే. చెన్నైపై ఇక అన్ని ఆశలూ వదిలేసుకోవాల్సి ఉంటుంది అభిమానులకు.

Story first published: Monday, April 4, 2022, 9:02 [IST]
Other articles published on Apr 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+