Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాలీవుడ్ నటితో క్రికెటర్ హార్ధిక్ పాండ్యా డేటింగ్?

Hardik Pandya Dateing With Esha Guptha ?
Is Hardik Pandya dating Esha Gupta?

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఓ బాలీవుడ్ నటితో డేటింగ్ ఉన్నాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొన్నాళ్ల కిందట పాండ్యా బాలీవుడ్ భామ ఎల్లీ ఎవ్రామ్‌తో డేటింగ్‌‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరూ లంచ్, డిన్నర్లకు చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

గతేడాది డిసెంబరులో హార్దిక్‌ పాండ్యా సోదరుడు కృనాల్‌ పాండ్యా పెళ్లికి ఎల్లీ హాజరుకావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ అడపాదడపా బయట కనిపించారు. ఓ సారి ముంబై ఎయిర్‌పోర్టులో ఎల్లీ.. హార్దిక్‌ను డ్రాప్‌ చేసి వెళ్తున్న ఫొటోలో నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

అయితే ఆ తర్వాత ఏమైందోగానీ.. ఇద్దరూ విడిపోయారు. తాజాగా హార్దిక్ పాండ్యా.. బాలీవుడ్ నటి ఇషా గుప్తాతో డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాకు చెందిన ఓ వెబ్‌సైట్ వెల్లడించింది. ఓ పార్టీలో ఈ ఇద్దరూ కలుసుకున్నారని, అప్పటి నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట.

ప్రస్తుతం ఒకరినొకరు అర్థం చేసుకొనే పనిలో ఉన్నారు. ఇద్దరూ కలిసి అభిమానులు, మీడియా కంట పడకుండా లంచ్‌, డిన్నర్లకు వెళ్లున్నారంట. అయితే, ఈ వార్తలపై ఇప్పటి వరకు అటు పాండ్యా.. ఇటు ఇషా కానీ ఎవరూ స్పందించలేదు. అయితే, ఇటీవల కాలంలో బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు, క్రికెటర్లు కలవడం కామన్‌ అయిపోయింది.

ఇటీవలే క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌.. బాలీవుడ్‌‌ నటి నిధి అగర్వాల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై రాహుల్‌తో పాటు నిధి కూడా ఖండించారు. తామిద్దరం మంచి స్నేహితులని, చిన్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఉందని, మా మధ్య అలాంటిదేమీ లేదని, ఏదైనా ఉంటే రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమీ లేదని తెలిపారు.

ఇదిలా ఉంటే ఇషా గుప్తా గతేడాది రిలీజై పెద్ద హిట్ సాధించిన బాద్‌షాహో మూవీలో చివరిసారిగా కనిపించింది.

Story first published: Wednesday, June 6, 2018, 18:45 [IST]
Other articles published on Jun 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+