Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అహమే ఐపియల్ ‌కు సౌరవ్ గంగూలీని దూరం చేసిందా?

Sourav Ganguly
ముంబై: మాజీ భారత సారథి, కోల్‌కతా ప్రిన్స్ సౌరవ్ గంగూలీ చర్యల కారణంగానే తాను మూడు ఐపిఎల్‌లకు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు మరే ఫ్రాంచైజీ ఐపిఎల్-4లో పట్టించుకోనట్టుగా తెలుస్తోంది. కెప్టెన్‌గా ఉన్నప్పుడు భారత్‌కు ఎక్కువ విజయాలు సాధించి పెట్టిన గంగూలీని కాదని ఫ్రాంచైజీలు మిగిలిన వారికి ప్రాధాన్యత ఇచ్చాయి. గంభీర్‌ను పదకొండు కోట్లకు పైగా వెచ్చించి కొన్న కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని మూడు సార్లు ఆ జట్టుకు సారథ్యం వహించిన గంగూలీని మాత్రం బేస్ రేటు 1.80 కోట్లకు కొనడానికి కూడా ఆసక్తి కనబరచలేదు. దీంతో గంగూలీ అభిమానులు పశ్చిమబెంగాల్‌లో తీవ్రంగా నిరసనలు తెలిపారు. బాలీవుడ్ కింగ్ షారూక్‌ఖాన్ దిష్టిబొమ్మలు దగ్దం చేశారు. దీంతో షారుక్‌ఖాన్, గంగూలీని తీసుకునే యోచనలో పడ్డట్టు సమాచారం.

అయితే షారుక్‌తో పాటు అన్ని ఫ్రాంచైజీలు గంగూలీవైపు ఆయన చర్యల కారణంగానే దూరం జరిగినట్టు తెలుస్తోంది. మన భారత ఆటగాళ్లకు భారీగా రేటు పలికింది. టెస్టు విజయసారథులు రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్‌లను కూడా ఫ్రాంచైజీలు బేస్ రేటుకు కొనుక్కున్నాయి. అదే గంగూలీని మాత్రం కొనడానికి ఎవరూ ఆసక్తి కనబరచలేదు. మొదటిరోజు ఏ ఫ్రాంచైజీ కొనక పోవడంతో రెండోరోజు ఎవరైనా కొనకపోతారా అని చూసినప్పటికీ నిరాశే మిగిలింది. ఎవరూ కొనని వారిలో సనత్ జయసూర్య వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ గంగూలీ మనవాడు కావటం, ఒకప్పటి భారత సారథి కావటంతో అందరి దృష్టి పడింది.

షారుక్‌ఖాన్ యజమానిగా ఉన్న కోల్‌కతా నైడర్స్ జట్టుకు వరుసగా మూడు పర్యాయాలు సౌరవ్ గంగూలీ సారథిగా వ్యవహరించారు. గంగూలీకి జట్టు యజమాని షారుక్‌ఖాన్‌తో ఎప్పుడూ పొసగలేని కారణంగా తీసుకోనట్టుగా పలువురు భావిస్తన్నారు. అంతేకాకుండా గంగూలీ జట్టును వైఫల్యంగా నడుపుతుండటంతో షారుక్‌ఖాన్ అప్పుడే గుర్రుగా ఉండేవాడు. ఓ సమయంలో గంగూలీని సారథ్య బాధ్యతలనుండి తప్పించి మరొకరిని నియమిస్తారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే జట్టు ప్రయోజనాల దృష్ట్యా షారుక్‌ఖాన్ సారథిని మార్చడానికి వెనకాడాడని, అయితే గంగూలీపై మాత్రం ఆయనకు ఆసంతృప్తి ఉందని మాత్రం చెప్పేవారు. జట్టు పరంగానే కాకుండా గంగూలీ కూడా వ్యక్తిగతంగా వైఫల్యం చెందాడు.

ఐపిఎల్ వైఫల్యాన్ని మినహాయిస్తే గంగూలీ రెండు సంవత్సరాలకు పైగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో ఫ్రాంచైజీలు గంగూలీని తీసుకోవడానికి వెనకాడాయి. కష్ట సమయంలో ఆదుకునే యువకులకు ఫ్రాంచైజీలు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాకుండా గంగూలీ బేస్ రేటు 1.80 కోట్లుగా ఉంది. ఒక్కో ఫ్రాంచైజీ 45 కోట్ల రూపాయల కన్నా ఆటగాళ్లపై ఖర్చు పెట్టవద్దు. మొదటిరోజు ఒక్కో ప్రాంచైజీ తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం 30 కోట్లనుండి 40 కోట్ల వరకు పెట్టాయి. 45 కోట్ల రూపాయలలో మిగిలింది తక్కువగా ఉండటం కూడా అందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే గంగూలీ అభిమానుల నిరసనల నిరసనలతో షారుక్ దిగివచ్చి గంగూలీని తీసుకుంటాడా లేదా అని చూడాల్సి ఉంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+