Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ స్టార్‌తో స్టార్ హీరోయిన్ డేటింగ్?

ఆర్సీబీ జట్టుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆటపరంగానే కాకుండా ఆర్సీబీ ప్లేయర్ల వ్యక్తిగత విషయాలపై కూడా నెటిజన్లు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్, పంజాబీ చిత్ర పరిశ్రమలో పాపులర్ అయిన షెహనాజ్ గిల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

స్టేడియంలో సందడి.. ఇంటర్వ్యూలో మనసులో మాట
గత కొంతకాలంగా షెహనాజ్ గిల్ తరచుగా ఆర్సీబీ మ్యాచ్‌లకు హాజరవుతూ స్టేడియంలో కనిపిస్తున్నారు. సాధారణంగా సినీ ప్రముఖులు మ్యాచ్ లకు రావడం సహజమే అయినా షెహనాజ్ గిల్ ప్రత్యేకంగా దేవదత్ పడిక్కల్‌ను ఉత్సాహపరుస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా షెహనాజ్ గిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టమని.. అతను ఆడుతుంటే చూడముచ్చటగా ఉంటుందని మనసులో మాట బయటపెట్టింది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది.

Is Devdutt Padikkal Dating Shehnaaz Gill Viral Insta Post Sparks RCB Star Romance Rumors Details

ఇన్‌స్టా పోస్ట్‌తో మొదలైన అసలు చర్చ
తాజాగా షెహనాజ్ గిల్ తన ఇన్‌స్టా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. "నా మనసు ఆర్సీబీలో ఉంది, నా జీవితం పంజాబ్‌లో ఉంది. పంజాబీలు తమ మనసుకు నచ్చిన చోట ప్రాణాలను సైతం ఇవ్వగలరు" అని ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో ఆమె 'ఆర్సీబీ' అని స్పష్టంగా ప్రస్తావించడం, అందులోనూ తన మనసు అక్కడే ఉందని చెప్పడంతో నెటిజన్లు ఓ అంచనాకు వచ్చేశారు. దేవదత్ పడిక్కల్‌ను ఉద్దేశించే ఆమె ఈ కామెంట్స్ చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మౌనంగా ఉన్న స్టార్ జంట
ఈ డేటింగ్ వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నప్పటికీ.. అటు దేవదత్ పడిక్కల్ కానీ, ఇటు షెహనాజ్ గిల్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మౌనం అర్ధాంగీకారం అని కొందరు అంటుంటే, కేవలం స్నేహం వల్లే షెహనాజ్ అలా రాసి ఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న వార్త మాత్రం ప్రస్తుతం క్రికెట్, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Story first published: Friday, May 15, 2026, 19:54 [IST]
Other articles published on May 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+