న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రేమలో హార్దిక్ పాండ్యా: డేటింగ్ చేస్తుంది ఎవరితో తెలుసా?

By Nageshwara Rao
Is cricketer Hardik Pandya dating Bollywood beauty Elli AvrRam?

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ప్రేమలో పడ్డాడు. స్వీడన్ భామ ఎల్లీతో డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇటీవల ముంబైలో హార్ధిక్ పాండ్యా అన్నయ్య కృనాల్ పాండ్యా పెళ్లిలో కూడా ఎల్లీ తళుక్కున మెరిసింది.

పెళ్లిలో అందరితో కలిసిపోయి మాటా మాటా కలపడం.... హార్ధిక్ పాండ్యాతో కలివిడిగా ఉండటాన్ని చూసి వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు బాలీవుడ్ మొత్తం కోడైకూస్తోంది. అయితే ఈ డేటింగ్‌ వార్తలపై హర్ధిక్‌ పాండ్యా, ఎల్లీలు ఇప్పటివరకు స్పందించక పోవడం విశేషం.

స్వీడన్‌కు చెందిన ఎల్లీ 'మిక్కీ వైరస్‌' అనే సినిమాతో 2013లో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాతో హర్ధిక్‌ పాండ్యా డేటింగ్‌ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం ప్రస్తుతం హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు.

కేప్‌టౌన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో పాండ్యా అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పాండ్యా 93 పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసి భారత్‌కు చక్కటి శుభారంభం ఇచ్చిన సంగతి తెలసిందే.

దీంతో తొలి టెస్టులో పాండ్యా ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికాల మధ్య శనివారం (జనవరి 13)న సెంచూరియన్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Story first published: Thursday, January 11, 2018, 10:16 [IST]
Other articles published on Jan 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X