Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆటగాళ్ల థ్యాంక్ నోట్‌: భారత్‌లో ధోని ఆఖరి మ్యాచ్ ఆడేశాడా?

హైదరాబాద్: టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్ ఇక ముగిసినట్లేనా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. బెంగుళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అనంతరం హోటల్ రూమ్‌లో టీమిండియా ఆటగాళ్లు ధోనిని సత్కరించి ఓ వినూత్న జ్ఞాపికను బహుకరించారు. చెక్కతో రూపొందించిన ఆ జ్ఞాపికకు నాలుగు సిల్వర్ స్టార్లు అతికించి అతడికి బహుమతిగా ఇచ్చారు. ఈ నాలుగు స్టార్లు ధోని నాయకత్వంలో భారత్‌ సాధించిన నాలుగు అద్భుత విజయాలకు సూచికలని టీమిండియా తెలిసింది.

ధోని నేతృత్వంలోని టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2009లో టెస్టుల్లో నంబర్‌వన్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ సాధించిన సంగతి తెలిసందే. ఈ నాలుగు ట్రోఫీలను గుర్తుకు తెచ్చే విధంగా నాలుగు సిల్వర్ స్టార్లను తీర్చిదిద్దారు.

ధోనికి థ్యాంక్ నోట్‌ చదివి వినిపించిన ఆటగాళ్లు

మూడో టీ20కి ముందు బెంగుళూరులో టీమిండియా బస చేసిన హోటల్లో జరిగిన ఈ ప్రైవేట్‌ కార్యక్రమానికి ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటగాళ్లందరూ థ్యాంక్ నోట్‌ను కూడా చదవి వినిపించారు.

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ధోని రిటైర్మెంట్?

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ధోని రిటైర్మెంట్?

పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి ధోని వీడ్కోలు పలికిన తర్వాత ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతారనే వార్తలు వచ్చాయి. తాజాగా బీసీసీఐ ధోనిపై చేసిన వ్యాఖ్యలు ఈ విషయానికి బలం చేకూర్చుతున్నాయి.

హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన రోహిత్ శర్మ

హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన రోహిత్ శర్మ

అంతేకాదు గాయం కారణంగా ఇంగ్లాండ్ సిరిస్‌కు దూరమైన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హాజరవ్వడం ఈ వార్తలకు బలమిస్తోంది. నిజానికి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా 2019 వరల్డ్ కప్‌లో ఆడాలని ఉన్నట్లు ధోని తన మనసులోని మాటను బయట పెట్టాడు. కానీ బీసీసీఐ ప్రయత్నాలను చూస్తుంటే ధోనికి ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి సిరిస్ అవుతుందని అంటున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీనే ధోనికి చివరి సిరిస్?

ఛాంపియన్స్ ట్రోఫీనే ధోనికి చివరి సిరిస్?

ఇదే గనుక నిజమైతే స్వదేశంలో ధోని తన చివరి మ్యాచ్‌ని ఆడినట్లే. ఈ క్రమంలో ధోని తన రిటైర్మెంట్‌పై నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి. ధోని కెప్టెన్సీలో టీమిండియా 2007లో ఐసీసీ వరల్డ్ టీ20, 2011లో ఐసీసీ వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+