Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్ క్రికెటర్ కన్నుమూత.. కొంపముంచిన ఆటో ట్రాన్స్‌లేషన్!

అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రహ్మత్ షా 32 ఏళ్ల వయసులో చనిపోయాడంటూ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియా వేదికగా ఓ వార్త విపరీతంగా హ‌ల్‌చల్ చేస్తోంది. ఈ వార్త చూసి అఫ్గాన్ క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే అసలు నిజం తెలుసుకోకుండా కొందరు చేసిన సోషల్ మీడియా పోస్టుల వల్లే ఈ గందరగోళం నెలకొందని.. రహ్మత్ షా మరణించాడనే వార్త కేవలం ఓ ఫేక్ న్యూస్ అని తేలింది. ఇన్ స్టాగ్రామ్ లో జరిగిన ఓ చిన్న అనువాద లోపం ఈ పెద్ద వివాదానికి కారణమైంది.

IPL 2026: కోహ్లీ వికెట్ తీసిన బౌలర్‌కు భారత జట్టులో చోటు!

IPL 2026: కోహ్లీ వికెట్ తీసిన బౌలర్‌కు భారత జట్టులో చోటు!

అసలేం జరిగిందంటే?
అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ కరీం జనత్ తన ఇన్‌స్టా ఖాతాలో రహ్మత్ షా ఫోటోను షేర్ చేస్తూ పష్తో (Pashto) భాషలో ఓ సంతాప సందేశాన్ని పోస్ట్ చేశాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను ఉపయోగించి నెటిజన్లు ఆ పోస్ట్‌ను ఇంగ్లీష్‌లోకి అనువదించి చదివారు. ఆ అనువాదంలో.. "అఫ్గానిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు దిగ్గజ ఆటగాడు రహ్మత్ షా మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ పెద్ద విషాదం నన్ను, క్రికెట్ అభిమానులను బాధించింది" అని తప్పుగా వచ్చింది. దీంతో రహ్మత్ షా చనిపోయాడని భావించిన నెటిజన్లు ఆ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతాపం తెలపడం ప్రారంభించారు.

Is Afghanistan Cricketer Rahmat Shah Dead Viral Translation Error Triggers Death Hoax

అయితే ఈ వార్తలపై లోతుగా విచారించగా అసలు నిజం తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్ ఇన్-బిల్ట్ ట్రాన్స్‌లేషన్ పష్తో భాషలోని అసలు అర్థాన్ని పూర్తిగా మార్చేసిందని స్పష్టమైంది. పష్తో భాషలో ఉన్న అసలు పోస్ట్‌ను సరిగ్గా అనువదిస్తే.. "జాతీయ క్రికెట్ జట్టు ప్రతిభావంతుడైన ఆటగాడు రహ్మత్ షా తల్లి గారు మరణించిన వార్త నేను విన్నాను. ఈ పెద్ద విషాదం నన్ను, క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధించింది. రహ్మత్ షాకు, ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ఉంది. అంటే చనిపోయింది రహ్మత్ షా కాదు.. ఆయన తల్లి గారు. కరీం జనత్ పెట్టిన పోస్ట్ కూడా రహ్మత్ షా తల్లి మృతికి సంతాపం తెలుపుతూ పెట్టిందే.

IPL 2026: నేడు కీలక పోరు.. ఓడితే ఆ రెండు జట్లు ఇంటికే!

IPL 2026: నేడు కీలక పోరు.. ఓడితే ఆ రెండు జట్లు ఇంటికే!

అసలు విషయం తెలిసి రహ్మత్ క్షేమంగానే ఉన్నాడని తెలియడంతో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి సున్నితమైన విషయాలపై అబద్ధపు వార్తలను ప్రచారం చేయవద్దని నెటిజన్లు కోరుతున్నారు. ఇక రహ్మత్ షా కెరీర్ విషయానికొస్తే.. అతను గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అఫ్గానిస్థాన్ తరఫున చివరిగా ఆడాడు. ఈ సిరీస్ లో గాయం కారణంగా చివరి మ్యాచ్‌కు రహ్మత్ షా దూరమయ్యాడు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు.

Story first published: Sunday, May 17, 2026, 11:55 [IST]
Other articles published on May 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+