ఆ స్టార్ హీరోయిన్‌తో అభిషేక్ శర్మ డేటింగ్?
టీమిండియా యువ సంచలనం, విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్తతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించిన అభిషేక్ శర్మ.. త్వరలోనే టీమిండియాతో కలిసి ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు బయలుదేరనున్నాడు. అయితే ఈ పర్యటనకు ముందే ఆయన ప్రముఖ నటి, మోడల్ మహీరా శర్మతో డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. వీరిద్దరి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులే ఈ రూమర్లకు ప్రధాన కారణం కావడం గమనార్హం.
ఈ పుకార్లకు బలమైన కారణం వీరిద్దరి చేతులకు ఉన్న ఒకే రకమైన బ్రాస్‌లెట్. ఇటీవలే నటి మహీరా శర్మ ఇన్‌స్టాగ్రామ్ లో బ్లాక్ టాప్, జీన్స్ ధరించిన కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలతో పాటు.. "మీరు ఏవైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి, కానీ కేవలం నా క్యూట్‌నెస్ గురించే" అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా పెట్టింది. అయితే అభిమానుల దృష్టి ఆమె క్యాప్షన్ కంటే.. ఆమె చేతికి ఉన్న 'ప్లస్ గుర్తు' కలిగిన బ్లాక్ కలర్ బ్రాస్‌లెట్‌పైనే ఎక్కువగా పడింది.

ట్విస్ట్ ఏంటంటే.. మహీరా ఈ ఫోటోలను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే.. స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ కూడా ఐపీఎల్ తర్వాత దిగిన రెండు ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ ఫోటోలలో అభిషేక్ శర్మ చేతికి కూడా సరిగ్గా మహీరా శర్మ ధరించినటువంటి 'ప్లస్ సైన్' బ్లాక్ బ్రాస్‌లెట్ స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో కూడా అభిషేక్ చేతికి ఈ బ్రాస్‌లెట్ ఉండటాన్ని కొందరు నెటిజన్లు గమనించారు. ఒకే సమయంలో ఇద్దరూ ఫోటోలు షేర్ చేయడం.. పైగా ఇద్దరి చేతులకు ఒకేలాంటి బ్రాస్‌లెట్ ఉండటంతో వీరిద్దరి మధ్య ఏదో గుట్టుగా నడుస్తోందని ఫ్యాన్స్ పుకార్లు పుట్టించడం గమనార్హం.
ప్రస్తుతానికి వీరిద్దరి డేటింగ్ వ్యవహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదా స్పష్టత రాలేదు. కానీ ఈ సోషల్ మీడియా 'సీక్రెట్' హింట్ మాత్రం నెటిజన్లకు, గాసిప్ ప్రియులకు మంచి టాపిక్‌గా దొరికింది. ఇక అభిషేక్ శర్మతో పేరు వినిపిస్తున్న మహీరా శర్మ విషయానికి వస్తే.. ఆమె ఓ పాపులర్ నటి, మోడల్. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మహీరా శర్మ ఎన్నో పంజాబీ మ్యూజిక్ వీడియోలు, సినిమాల్లో నటించారు. అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 'బిగ్ బాస్ సీజన్ 13' లో కంటెస్టెంట్‌గా అలరించారు. వీటితో పాటు 'నాగిన్', 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' వంటి సూపర్ హిట్ టీవీ సీరియల్స్ ద్వారా కూడా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications